Ram Charan - NTR : రామ్ చరణ్.. ఎన్టీఆర్ ను ఫాలో అవుతాడా లేదా..?

Ram Charan - NTR :  రామ్ చరణ్.. ఎన్టీఆర్ ను ఫాలో అవుతాడా లేదా..?
X

ఆర్ఆర్ఆర్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య బాండింగ్ బానే ఉంది. ఎటొచ్చీ ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా వార్ తో రచ్చ చేస్తున్నారు. ఇందులో ఎవరిది అప్పర్ హ్యాండ్అనేది పక్కన బెడితే.. ఈ హీరోలెవరూ ఈ ఫ్యాన్ వార్ ను పట్టించుకోరు అనేది నిజం. అయినా అవి ఆగవు. ప్రస్తుతం రామ్ చరణ్ ఫ్యాన్స్ ముందు ఓ సవాల్ ఉంది. అదే గేమ్ ఛేంజర్. ఎన్టీఆర్ దేవర మూవీపై ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా.. ఆ సినిమా రికార్డ్ కలెక్షన్స్ సాధించిందని.. 500 కోట్ల మార్క్ ను టచ్ అయ్యేంత వరకూ కొత్త పోస్టర్స్ వేశారు. ఈ విషయంలోనూ విమర్శలు ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల షేర్ రికార్డ్ ను కూడా దేవర బద్ధలు కొట్టిందని చెబుతున్నారు. ఆ మేరకు ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

ఇక నెక్ట్స్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో జనవరి 10న విడుదల కాబోతోంది. ఈ మూవీ కూడా చాలా రికార్డులు క్రియేట్ చేస్తుందని.. ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ రికార్డుల పోస్టర్స్ కూడా రోజూ విడుదల చేస్తారు అనుకుంటున్నారు. బట్ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. తన సినిమాల కలెక్షన్స్ కు సంబంధించిన వివరాలు చెప్పడం నచ్చదని అందుకే ఆపేయమని చెప్పా అంటూ ఆ మధ్య ఓ సినిమా విషయంలో చెప్పాడు రామ్ చరణ్. బట్ ఇప్పుడు సిట్యుయేషన్ మారింది. ఎంత కాదనుకున్నా.. నాటు నాటు సాంగ్ లో లాగా ఇద్దరి మధ్య ఇన్ డైరెక్ట్ పోటీ అయితే ఉంది. అందుకే ఎన్టీఆర్ ను ఫాలో అవుతూ.. రామ్ చరణ్ మూవీ కలెక్షన్స్ పోస్టర్స్ ను రికార్డ్స్ తో పాటు ప్రకటించాల్సి ఉంటుంది. మరి ఇందుకు రామ్ చరణ్ ఒప్పుకుంటాడా అనేది పెద్ద ప్రశ్న. ఒప్పుకుంటే మళ్లీ కంపేరిజన్స్ తో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా సాక్షిగా అసహ్యకరమైన వార్ మొదలవుతుంది.

Tags

Next Story