Samantha Ruth Prabhu : చైతన్య పెళ్లిపై సమంత రియాక్ట్ అవుతుందా..

Samantha Ruth Prabhu : చైతన్య పెళ్లిపై సమంత రియాక్ట్ అవుతుందా..
X

అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. నటి శోభిత ధూళిపాలతో ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. వీరిది కూడా లవ్ మ్యారేజ్ అంటున్నారు చాలామంది. కొన్నాళ్లుగా ఇద్దరూ చెట్టా పట్టాలేసుకుని ఎవరికీ తెలియకుండా మెయిన్టేన్ చేస్తూ తిరిగారు. బట్ ఇలాంటివి ఎక్కువ కాలం దాగవు కదా. అందుకే కొన్ని రోజుల తర్వాత చైతన్య, శోభిత లవ్ లో ఉన్నారని తెలిసిపోయింది. అయితే అంతకు ముందు కూడా సమంతను ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు చైతన్య.

ఈ ఇద్దరూ కలిసి నటించిన ఫస్ట్ మూవీ ఏ మాయ చేశావె నుంచే ప్రేమలో ఉన్నాం అని చాలాసార్లు చెప్పింది సమంత. బట్ మధ్యలో సిద్ధార్థ్ తో కొన్నాళ్లు ఎఫైర్ సాగిందనే వార్తలు కూడా చూశాం. ఫైనల్ గా చే ని 2017లో పెళ్లి చేసుకుంది. చాలా లవబుల్ కపుల్ గా వీరికి పేరొచ్చింది. బాలీవుడ్ మీడియా కూడా చే, శామ్ గురించి రకరకాల వార్తలు పాజిటివ్ గా రాసేది. అలాంటి సడెన్ గా 2021లో డివోర్స్ తీసుకున్నారు. అందుకు కారణాలేవైనా.. వీళ్లు విడిపోయారన్న వార్త చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారనే చెప్పాలి. అప్పటి నుంచి ఎవరి లైఫ్ లో వాళ్లు ఉంటున్నారు. ఇద్దరూ కెరీర్ పై ఫోకస్ చేశారు.

అయితే ఈ విడాకులు వ్యవహారంలో చాలామంది సమంతనే నెగెటివ్ చేయాలని చూశారు. అన్నిటికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది సమంత. సరే వ్యక్తి గత జీవితంలో ఏం జరిగింది అనేది వారికి మాత్రమే తెలుసు. ఎవరి ఊహల్లోనూ వేరే వారి జీవితాలు ఉండవు. కాబట్టి ఏం జరిగింది అనేది ఇప్పుడు అప్రస్తుతం. బట్.. ఇంత విడాకులు అయిన మూడేళ్లకే ‘‘లవ్ మ్యారేజ్’’ చేసుకుంటోన్న ఈ కపుల్ గురించి, వారి పెళ్లి గురించి సమంత రియాక్ట్ అవుతుందా.. అయితే ఎలా ఉంటుంది..అంటూ సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయినా వాళ్ల పిచ్చి కానీ.. సమంత స్పందిస్తుందా..?

Tags

Next Story