Upendra : శివరాజ్ కుమార్, ఉపేంద్ర కలిసి మ్యాజిక్ చేస్తారా

Upendra  :  శివరాజ్ కుమార్, ఉపేంద్ర కలిసి మ్యాజిక్ చేస్తారా
X

శివరాజ్ కుమార్, ఉపేంద్ర కలిసి ఓ మ్యాజిక్ చేయబోతున్నారా అనిపించేలా ఉంది కొత్త సినిమా. ఈ మూవీ టైటిల్ చూస్తుంటేనే వెరైటీగా ఉంది. సింపుల్ గా నంబర్ ‘45’అనే నంబర్ ను టైటిల్ గా పెట్టుకున్నారు. ఈ మూవీ జనవరి 1న విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది టీమ్. అది కూడా తెలుగు ట్రైలర్. ట్రైలర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కంటెంట్ పరంగా కూడా ఆకట్టుకునేలా ఉంది అనిపిస్తోంది. పోనీ ఈ మూవీ దర్శకుడు ఉపేంద్రనే అంటే కాదు.. అర్జున్ జన్య అనే వ్యక్తి దర్శకుడు. ట్రైలర్ మొత్తం ఆద్యంతం ఉపేంద్ర డైరెక్ట్ చేసిన మూవీలా అనిపించేలా కట్ చేశారు.

శివరాజ్ కుమార్, ఉపేంద్ర తో పాటు మరో టాలెంటెడ్ యాక్టర్ రాజ్ బి శెట్టి నటించాడు. హీరోయిన్ ఎవరు అనేది తెలియకుండా ఉంచారు. ‘అక్కడ సమాధి మధ్య.. మనిషి పుట్టిన తేదీ.. డ్యాష్.. మరణించిన తేదీ రాసి ఉంటుంది.. ఆ మధ్యన ఉన్న చిన్న డ్యాషా.. మనిషి మొత్తం జీవితం ’అనే డైలాగ్ తో స్టార్ట్ అయింది ట్రైలర్. మేకింగ్ పరంగా, టేకింగ్ పరంగా కూడా కొత్తగా ఉండేలా ఉంది ట్రైలర్ చూస్తుంటే. అలాగే ముగ్గురు ప్రధాన పాత్రల మధ్య కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ లా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజ్ బి శెట్టి క్యారెక్టర్ కొత్తగా ఉండబోతోందనిపించేలా ఉంది. మొత్తంగా మాస్ ఆడియన్స్ ను కూడా టార్గెట్ చేసేలా.. ప్యాన్ ఇండియన్ మూవీలా కనిపించేలా ఉంది మూవీ. చూద్దాం.. మరి కొత్త యేడాదిన మొదటి రోజున కొత్త ఫీల్ ఇచ్చేలా మూవీలా ఉంటుందా లేదా అనేది చూద్దాం.

Tags

Next Story