Tamannaah Bhatia : తమన్నా కోరిక నెరవేరుతుందా..?

Tamannaah Bhatia :  తమన్నా కోరిక నెరవేరుతుందా..?
X

తమన్నా.. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు కావొస్తోంది. ఇప్పటికీ అదే గ్లామర్ ను మెయిన్టేన్ చేస్తుంది. ఛార్మింగ్ బ్యూటీగా సత్తా చాటుతోంది. వరుస ఆఫర్స్ తో దూసుకుపోతూనే ఉంది. హీరోయిన్ గా చేస్తూనే ఐటమ్ సాంగ్స్ తో సినిమాలకే క్రేజ్ తెస్తోంది. ప్రస్తుతం తను నటించిన ఓదెల 2 ఈ నెల 17న విడుదల కాబోతోంది. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసిన ఈ చిత్రాన్ని అశోక్ తేజ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో తమన్నా అఘోరీ పాత్రలో కనిపించబోతోంది. ఈ చిత్రం తన కెరీర్ లో ఓ స్పెషల్ మెమరీగా ఉండబోతోందని నమ్ముతోంది తను. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్స్ చూస్తే చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది మూవీ. టీజర్ కు జనం ఫిదా అయితే ట్రైలర్ తో స్పెల్ బౌండ్ చేశారు.

ఓదెల గ్రామంలోని దుష్ట శక్తిని అంతం చేసే అఘోరీగా తమన్నా కనిపించబోతోంది. ఇప్పటి వరకూ తను చేసినవాటిలో మాగ్జిమం స్కిన్ షోకే పరిమితమైన పాత్రలే ఎక్కువగా ఉన్నాయి. అప్పుడప్పుడూ తనలోని నటిని కూడా చూపిస్తూ వస్తోంది. కానీ ఈ తరహా పాత్ర అంటే ఖచ్చితంగా ఓ ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ ను దాటడం అంత సులువైన విషయం కాదు. దాదాపు తన కంటే కాస్త అటూ ఇటూగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్లలో ఫీమేల్ ఓరియంటెడ్ కథలతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తమన్నాకూ ఆ తరహాలో లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలనే కోరిక ఉంది. అందుకు ఓదెల 2 విజయం చాలా ఇంపార్టెంట్. అంటే సినిమా విజయం సాధించడమే కాదు.. ఆ విజయానికి అన్ని రకాలుగా తమన్నానే కారణం కావాలి. తన చుట్టూనే ఓదెల 2 విజయం గురించి మాట్లాడుకోవాలి. ఇంకెన్ని పాత్రలున్నా.. తమన్నానే హైలెట్ కావాలి. అప్పుడే తను లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసినా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రియాక్షన్ ఉంటుంది. మరి ఈ సినిమా విజయం సాధించి ఇలా తన గురించే మాట్లాడుకునేలా చేసి.. తమన్నా కోరిక నెరవేరుస్తుందా లేదా అనేది చూడాలి.

Tags

Next Story