Coolie vs War 2 : బాక్సాఫీస్ షేక్ అవుతుందా.. షాక్ ఇస్తుందా..

Coolie vs War 2 :  బాక్సాఫీస్ షేక్ అవుతుందా.. షాక్ ఇస్తుందా..
X

రెండు భారీ సినిమాలు ఒకే రోజు విడుదలై ఈ మధ్య చాలాకాలం అవుతోంది. కనీసం ఒకటీ రెండు రోజుల గ్యాప్ అయినా చూసుకుంటున్నారు. బట్ కలిసొచ్చిన హాలిడేస్ ను వాడుకునేందుకు ఎప్పట్లా శుక్రవారం కాకుండా ఒక రోజు ముందుగానే వస్తున్నాయి వార్ 2, కూలీ. రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ వంటి భారీ తారాగణంతో ప్యాన్ ఇండియా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన కూలీ భారీ అంచనాలతో మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు వస్తోంది.

ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో రూపొందిన వార్ 2 కూడా అదే టైమ్ కు వస్తోంది. మరి ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ చూస్తాయి అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. రెండు సినిమాలకు సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయం. అలా కాకుండా రెండిటికీ యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు బానే ఉంటాయి. లేదా ఏదో ఒక సినిమాకే హిట్ టాక్ వస్తే మిగిలిన సినిమా ఇమ్మీడియొట్ గా డౌన్ అయిపోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అప్పుడు వార్ ఒన్ సైడ్ అవుతుంది. కొన్నేళ్లుగా సంక్రాంతి వంటి పెద్ద సీజన్స్ లో కూడా అన్ని సినిమాలకూ హిట్ టాక్ రావడం లేదు. ఒకటీ రెండు మాత్రమే విజేతలుగా నిలుస్తున్నాయి. ఆ ట్రెండ్ ను దాటి ఈ గురువారం రెండు సినిమాలకూ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే హిస్టరీ క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. లేదంటే షాక్ లు తప్పవు. మరి ఈ గురువారం హిస్టరీ క్రియేట్ అవుతుందా.. లేక షాకింగ్ గా మారుతుందా అనేది చూద్దాం.

Tags

Next Story