Dacoit Movie : డెకాయిట్ ఈ డేట్ కు వస్తుందా..?

Dacoit Movie :  డెకాయిట్ ఈ డేట్ కు వస్తుందా..?
X

హిట్ మెషీన్ అనిపించుకున్న హీరో అడివి శేష్. అతను ఎంచుకుంటోన్న కథల్లో కొత్తదనం ఉంటోంది. లేదంటే ఒకే తరహాలో సాగే కథల్లోనే కొత్తదనం ఉంటుంది. ఎలా చూసినా అవి విజయం సాధించడం కామన్. అయితే ఈ సారి ట్రెండ్ మార్చాడు. మేజర్ గానో లేక ఏజెంట్ గానో కనిపించకుండా ఈ సారి డెకాయిట్ అవతారం ఎత్తాడు. డెకాయిట్ మూవీ అనౌన్స్ అయిన దగ్గర నుంచీ ట్రెండింగ్ లోనే ఉంది. మొదట శ్రుతి హాసన్ ను తీసుకున్నారు. తర్వాత తను తప్పుకుంది. ఆపై మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నారు. మొత్తంగా ఈ ప్రాసెస్ లో మూవీ కాస్త లేట్ అవడంతో.. రిలీజ్ డేట్ మారింది. మార్చి 19న విడుదల చేస్తాం అని ప్రకటించారు. బట్ అదే రోజు ధురంధర్ 2 కూడా విడుదలవుతుండటంతో డెకాయిట్ కాస్త భయపడ్డట్టుగా కనిపించింది. అందుకు కారణం ధురంధర్ 2 పై ఉన్న అతి భారీ అంచనాలే. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే అదరగొడుతోంది.

ఇక డెకాయిట్ కొత్త రిలీజ్ డేట్ గా ఏప్రిల్ 10 అని ప్రకటించారు. ఈ డేట్ కూడా ముందు నుంచీ ఎక్స్ పెక్ట్ చేసిందే. ఆ టైమ్ కే గ్యారెంటీగా విడుదలవుతుందని చాలామంది భావించారు. వాళ్లు అనుకున్నట్టుగానే ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. షనీల్ డియో డైరెక్ట్ చేసిన డెకాయిట్ లో చాలా ప్రత్యేకతలు ఉంటాయట. ఈ మూవీలో శేష్ పాత్ర కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. మృణాల్ ఠాకూర్ తో పాటు అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునిల్, కామాక్షి భాస్కర్ల, జేన్ మారీ ఖాన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మరి ఈ రిలీజ్ అయినా అదే టైమ్ కు వస్తుందా లేక ఇరాన్ యుద్ధం కారణంగా చూపుతూ మళ్లీ వాయిదా పడుతుందా అనేది చూడాల్సిందే.

Tags

Next Story