OG First Look Update: ముహూర్తం ఖరారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే 'బ్రో' మూవీతో మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆయనతో పాటు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహించారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా విషయాలకొస్తే.. సుజిత్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీలో నటిస్తున్నారు. అయితే మొదటి నుంచి ఈ సినిమాపై అందరిలోనూ మంచి హైప్ ఏర్పరిచగా.. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవర్ఫుల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం. కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న'ఓజీ'కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ బజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ అవుతోంది. దీని ప్రకారం ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ని ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 15న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న 'ఓజి' మూవీ.. డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం కనపడుతోంది. కాగా ఈ క్రేజీ బజ్ పై మేకర్స్ నుండి అఫీషియల్ అప్ డేట్ అయితే రావాల్సి ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో 'ఓజీ' ఒకటి. ఈ సినిమా డైరెక్టర్ సుజీత్ గతంలో రన్ రాజా రన్, సాహూ వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. ఇక్కడ మరో విషయం ఏమంటే సుజీత్ స్వయంగా పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరో రేంజ్‌లో ఉన్నాయి. మొదట ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్‌గా 'OG' అని ప్రచారం చేసారు. అయితే ఈ టైటిల్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇక అదే టైటిల్‌ను దర్శక నిర్మాతలు రిజిష్టర్ చేశారని తెలుస్తోంది. నిర్మాత DVV దానయ్య, 5 ప్రధాన భారతీయ భాషలలో 'OG' అనే టైటిల్‌ని రిజిష్టర్ చేశారట. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటించనున్నారు. అంతే కాదు పవన్ పాత్ర పేరు ఈ సినిమాలో 'ఓజాస్ గంభీరా' అని, దీంతో అందరూ అతన్ని 'ఓజీ' అని పిలుస్తారనే ప్రచారమూ జరుగుతోంది. అందుకే ఈ సినిమా టైటిల్ కూడా ఓజీగా ఫిక్స్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com