Mana Shankaravara Prasad Garu : సంక్రాంతి పాంచ్ పటాస్ అవుతుందా..?

Mana Shankaravara Prasad Garu :  సంక్రాంతి పాంచ్ పటాస్ అవుతుందా..?
X

సంక్రాంతి వస్తుందంటే ఆ టైమ్ కు విడుదలవుతోన్న సినిమాలేంటీ అనుకోవడం అనేది తెలుగువాళ్లందరికీ తెలిసిన కామన్ థింగ్. తెలుగువాళ్లకు సంక్రాంతి అంటే సినిమాతో పాటుగా చేసే సెలబ్రేషన్. మరి ఈ సెలబ్రేషన్ లో ఈ సారి ఎన్ని సినిమాలు వస్తున్నాయి. వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాలి కదా.

ఈ నెల 9న మొదటగా వస్తోన్న మూవీ రాజా సాబ్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ఇది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా సంజయ్ దత్, జరీనా వాహబ్ కీలక పాత్రల్లో నటించారు. మారుతి డైరెక్ట్ చేసిన ఈ భారీ హారర్ మూవీ కోసం ఈగర్ గా చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ పరంగా మాత్రం చాలా వెనకబడి పోయింది. మరో ఐదు రోజుల్లోనే విడుదల కాబోతోందీ మూవీ. బట్ ఈ విషయంలో మాత్రం చాలా డల్ గా ఉన్నారు. పైగా ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ పరంగా చాలా వెనకబడి ఉంది. మరి ఇది రిజల్ట్ పై ఏమైనా ప్రభావం చూపిస్తుందేమో అనేది తెలియాల్సి ఉంది. అయితే సినిమా చాలా పెద్దది. నిడివి దాదాపు 2 గంటల 55 నిమిషాలు. అంటే ఆల్మోస్ట్ మూడు గంటలు ఉండబోతోందన్నమాట.

ఇక జనవరి 12న విడుదల కాబోతోన్న మెగాస్టార్ చిరంజీవి మూవీ మన శంకరవర ప్రసాద్ గారు. హిట్ మెషీన్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందిన మూవీ ఇది. నయనతార, కేథరీన్ థ్రెస్సా హీరోయిన్లుగా నటించారు. వెంకటేష్ కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. కాకపోపతే ట్రైలర్ తర్వాత మరింతగా తెలుస్తుందీ మూవీ కెపాసిటీ ఏంటీ అనేది. అనిల్ రావిపూడి మూవీస్ అంటే యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ పర్ఫెక్ట్ గా మిక్స్ అయినట్టుగా కనిపిస్తుంటాయి. మరి మన శంకర వరప్రసాద్ గారి దమ్మేంటీ అనేది తెలుస్తుంది. బట్ ఈ మూవీపై మాత్రం చాలా అంచనాలైతే ఉన్నాయి. ఫస్ట్ టైమ్ చిరంజీవితో చేసిన భీమ్స్ సిసిరోలియో సంగీతం ఆల్రెడీ హిట్ అయింది.

జనవరి 13న విడుదల కాబోతోన్నమూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. మాస్ మహరాజ్ రవితేజ, అషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరో, హీరోయిన్లుగా నటించారు. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. ఇద్దరు ఆడవాళ్ల మధ్య నలిగిపోయే వ్యక్తిలా కనిపించే హీరో. అందులో ఒకరు అతని భార్య, మరొకరి లవర్ కావడం సినిమాలో మంచి వినోదం అందించే అవకాశం ఉండేలా ఉంది. ఈ మూవీపైనా అంచనాలున్నాయి. కాకపోతే రవితేజ కొన్నాళ్లుగా ఫ్లాప్స్ చూస్తున్నాడు. ఆ ట్రెండ్ ను మార్చి ఈ మూవీతో సంక్రాంతి బరిలో విజయం అందుకోబోతున్నాడు అనిపించేలా ఉంది. భీమ్స్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉంది.

ఇక జనవరి 14న విడుదల కాబోతోన్న మూవీ అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌధరి జంటగా నటించిన మూవీ ఇది. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో విజయాన్ని అందుకున్న కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. నాగవంశీ నిర్మాత. వీళ్లు సంక్రాంతికి విడుదల అంటూ చాలా ముందుగానే అనౌన్స్ చేశారు. చేసినట్టుగానే సంక్రాంతి బరిలో విడుదల కాబోతోంది. ఈ టైమ్ లో ఉండే ఎంటర్టైన్మెంట్స్ కు చాలా ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తోంది నవీన్ పోలిశెట్టికి.

ఇక చివరగా విడుదల కాబోతోన్న మూవీ నారీ నారీ నడుమ మురారి. ఇది కూడా జనవరి 14నే విడుదల కాబోతోంది. శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇది కూడా ఆల్మోస్ట్ భర్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి మూవీలానే కనిపిస్తోంది. ఇద్దరు హీరోయిన్లు, హీరోతో ప్రాబ్లమ్స్, తద్వారా పండించే వినోదంలా కనిపిస్తోంది. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన మూవీ ఇది. కాకపోతే ఇప్పటి వరకు విడుదలకు సంబంధించి పెద్దగా సౌండ్ కనిపించడం లేదు. మరి సంక్రాంతి బరిలో ఉంటుందా ఉండదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. బట్ ఆ రోజున విడుదల గ్యారెంటీ అనిపించేలా పోస్టర్స్ మాత్రం వదులుతున్నారు.

మొత్తంగా ఐదు తెలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. గతేడాది కేవలం మూడు సినిమాలు వచ్చాయి. ఈ యేడు ఐదు అంటే పోటీ గట్టిగానే ఉండబోతోంది. ఇవి కాక జన నాయగన్, పరాశక్తి అంటూ తమిళ్ మూవీస్ కూడా విడుదల కాబోతున్నాయి. ఆ రెండు సినిమాలు ఎలా ఉన్నా.. ఈ ఐదు మూవీస్ మాత్రం పాంచ్ పటాస్ లా పేలుతాయా లేదా అనేది చూద్దాం.

Tags

Next Story