Ram Pothineni : రామ్, హరీష్ శంకర్ సినిమా ఉంటుందా..

Ram Pothineni :   రామ్, హరీష్ శంకర్ సినిమా ఉంటుందా..

కొన్ని కాంబినేషన్స్ అనౌన్స్ అయినప్పుడు బానే ఉంటాయి. కాకపోతే అవి దగ్గరకు వస్తున్నప్పుడే తేడాగా అనిపిస్తాయి.. అసలుంటాయా అనే డౌట్స్ వస్తాయి. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ తో తన నెక్ట్స్ మూవీ రామ్ పోతినేనితో అని ఓపెన్ గా అనౌన్స్ చేశాడు హరీష్ శంకర్. బట్ రామ్ వైపు నుంచి అలాంటి ప్రకటనలేం రాలేదు. కట్ చేస్తే ఇద్దరి సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. రెండూ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. రామ్ కు ఇది వరుసగా నాలుగో ఫ్లాప్. హరీష్ శంకర్ కు ఫ్లాప్ పడటం కంటే ఈ మూవీకి ముందు అతను ఇచ్చిన బిల్డప్స్ మైనస్ అయ్యాయి. బట్ బచ్చన్ లో అతని మార్క్ టేకింగ్, మేకింగ్ అస్సలు కనిపించలేదు అనే టాక్ బలంగా వినిపించింది. మామూలుగా అతను మంచి వినోదం అందించడంలో ముందుంటాడు. బట్ బచ్చన్ విషయంలో అన్ని అంశాల్లో చప్పగా కనిపించాడు. రీమేక్ అయినా 80 శాతం మార్చాను అన్నాడు. ఆ 80 శాతం సినిమాకు మైనస్ గానే మారడంతో హరీష్ పై అనుమానాలు పెరిగాయి.

ఇక ఇటు డబుల్ ఇస్మార్ట్ అంటూ వచ్చిన రామ్ తన వరకూ బానే చేసినా సినిమా పోయింది. మరి విషయం లేనప్పుడు పోతుంది కదా..? పూరీ జగన్నాథ్ అవుట్ డేటెడ్ ఆలోచనలతో రూపొందించిన ఈ మూవీకి కంప్లీట్ గా డిజాస్టర్ టాకే వినిపించింది. దీంతో రామ్ మరోసారి ఆత్మరక్షణలో పడ్డాడు. ఇలాంటి టైమ్ లో హరీష్ శంకర్ లాంటి వాళ్లతో సినిమా చేస్తే మరో రిస్క్ తెలిసి మరీ చేసినట్టవుతుంది. అందుకే ఈ కాంబోలో సినిమాపై ఇప్పుడు ఇండస్ట్రీ అంతా అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటీ అనేది ఇప్పటి వరకూ క్లియర్ గా తేలలేదు. హరీష్ చెప్పాడు కాబట్టి అతనితోనే అనుకుంటున్నారు అందరూ. కాకపోతే ఇప్పుడు సిట్యుయేషన్స్ మారాయి. ఇలాంటి సందర్భంలో రామ్ రిస్క్ చేస్తాడు అనుకోలేం. అయినా ముందడుగు వేశారు అంటే అన్నిటికీ సిద్ధమయ్యే ముందుకు వెళుతున్నట్టుగా భావించాలి. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయితే మాత్రం ముందు జాగ్రత్త అనుకోవచ్చు.

కాకపోతే ఇప్పుడీ కాంబినేషన్ లో సినిమా అనేది టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది.

Tags

Next Story