Dulquer Salman : లక్కీ భాస్కర్ కు సీక్వెల్ కూడా రెడీ అవుతుందా..?

లక్కీ భాస్కర్.. 2024 అక్టోబర్ 31న విడుదలైన సినిమా. 1992లో సాగే కథగా ఉంటుంది. చాలా చిన్న మూవీగా విడుదలైన లక్కీ భాస్కర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ విషయంలో చాలామంది సింపుల్ మూవీ అనుకున్నారు. కానీ ఇంపాక్ట్ మాత్రం భారీగా కనిపించింది. ఫ్యామిలీ స్టోరీలా మొదలై.. నేషనల్ ఫైనాన్షియల్ ఇష్యూగా మారేంత వరకు ఆకట్టుకుందీ మూవీ. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌధరి జంటగా నటించిన మూవీ. ఇలాంటి కథను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయనంతగా ఆకట్టుకుంది మూవీ. మరే ముంబై నుంచి అమెరికా వరకు వెళ్లిన ఆ ఫ్యామిలీ తిరిగి ఇండియాకు వెళుతుందా..? అసలు అమెరికాలో ఎలా ఫిక్స్ అయ్యారు..? అనే పాయింట్ తో సీక్వెల్ ఉండబోతోంది అనిపిస్తోందీ మూవీ.
దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన మూవీ కదా.. వెంకీని సీక్వెల్ చేయబోతున్నాడు అంటున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి తమిళ్ హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి కాబోతోంది. ఈ కథ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీగానే ఉండబోతోందనే టాక్ ఉంది. మమితా బైజు హీరోయిన్ గా నటించబోతోంది. వెంకీ తర్వాత ప్రాజెక్ట్ ను లక్కీ భాస్కర్ సీక్వెల్ గానే రూపొందించబోతున్నాడు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి నిజంగానే లక్కీ భాస్కర్ కు సీక్వెల్ అంటే.. చాలా ప్రశ్నలు మిగిలిపోతాయి కాబట్టి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందా లేదా అనేది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

