Megna Mukherjee : బరాబర్ ఈ అమ్మాయి స్టార్ అవుతుందా..?

Megna Mukherjee :  బరాబర్ ఈ అమ్మాయి స్టార్ అవుతుందా..?
X

కొంతమంది హీరోయిన్లకు ముందుగానే వారి కెరీర్ డిసైడ్ అవుతుంది. అంటే ఫస్ట్ మూవీతోనే బెస్ట్ అనిపించుకుంటారు. సినిమా రిజల్ట్ తో అస్సలు పనిలేకుండా కూడా వారికి ఆఫర్స్ వస్తాయి. అలాంటి వారిలో ఈ మధ్య భాగ్యశ్రీ బోర్సే ఉంది. తన ఫస్ట్ మూవీ కాంత అయినా మొదట విడుదలైంది మిస్టర్ బచ్చన్. బట్ ఇది డిజాస్టర్ అయింది. తర్వాత కూడా కింగ్ డమ్, కాంత, ఆంధ్రాకింగ్ తాలూకా లాంటి మూవీస్ వచ్చాయి. బట్ ఇక్కడి వరకూ తన టాలెంట్ వల్లే మూవీస్ వచ్చాయి. బట్ అన్ని సినిమాలు పోవడం మాత్రం మైనస్ అయింది. బట్ లక్ ఉంటే చాలు స్టార్ హీరోయిన్ గా అయిపోతుంది. అలా బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరోయిన్ విషయంలో కూడా ఇదే కనిపించబోతోంది అనేలా ఉంది.

పాప పేరు మేఘనా ముఖర్జీ. బెంగాలీ అమ్మాయి. ముంబైలోనే పెరిగింది. మోడలింగ్ నుంచి మిస్ ఇండియా వరకూ వచ్చింది. చూడగానే ఆకట్టుకునే రూపం ఉంది. అందం ఉంది, హొయలు చూపించే వయ్యారం కూడా ఉంది. ఫస్ట్ మూవీనే బరాబర్ ప్రేమిస్తా. ఈ మూవీ కాంట్రవర్శీలో పడిపోయింది. అంటే మూవీ కాదు.. సినిమా హీరో వరకు మాత్రమే ఆ కాంట్రవర్శీ అయింది. అయితే ఈ మూవీ ట్రైలర్ చూస్తే మాత్రం అమ్మాయి చూడగానే భలే ఉంది కదా అనిపిస్తుంది. టాలెంట్ కూడా చూపించే అవకాశం ఉండేలా ఉంది. ఈ కెరీర్ లో ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్నిటినీ తట్టుకుని నిలబడటం తనకు బాగా తెలుసు అంటోంది. మరి ఈ మూవీ రిజల్ట్ తో పనిలేకుండా తను సత్తా చాటే అవకాశాలున్నాయి. మరి ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడాల్సిందే.

Tags

Next Story