Kubera : ఈ వారం సినిమాలు టాలీవుడ్ ను గట్టెక్కిస్తాయా

Kubera :  ఈ వారం సినిమాలు టాలీవుడ్ ను గట్టెక్కిస్తాయా
X

జూన్ లో టాలీవుడ్ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని నమ్మారు అంతా. బట్ ఫస్ట్ వీక్ వచ్చిన థగ్ లైఫ్ దారుణంగా డిజాస్టర్ అయింది. హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టీ ఈ 20న రిలీజ్ కాబోతోన్న కుబేరపైనే ఉంది. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అంతకు ముందు వచ్చిన దేవర ట్రాన్స్ లో దేవీ శ్రీ ప్రసాద్ ఆర్ఆర్ హైలెట్ గా నిలిచింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శేఖర్ కమ్ముల చెప్పిన మాటలు విని హీరోలు కూడా ఈ మూవీపై కాన్ఫిడెంట్ గా ఉన్నాం అని చెప్పారు.కుబేర శేఖర్ కమ్ముల తన భావజాలానికి తగ్గట్టుగా రూపొందించిన సినిమా ఇది అని చెప్పాడు. మరి ఇది ఆడియన్స్ కు వినోదం అందిస్తుందా లేదా అనేది సినిమా వస్తే కానీ చెప్పలేం. బట్ ఎలా చూసినా తెలుగు, తమిళ్ లో ఈ మూవీపై మంచి అంచనాలైతే ఉన్నాయి. మొదటి ఆటతో హిట్ టాక్ తెచ్చుకుంటే సూపర్ హిట్ అయిపోయినట్టే అనుకోవచ్చు.

ఇక ఈ చిత్రంతో పాటు పెద్దగా ప్రమోషన్స్ లో కనిపించకుండా.. ఏ మాత్రం హడావిడీ లేకుండా మరో తెలుగు సినిమా వస్తోంది. అదే 8 వసంతాలు. మ్యాడ్ ఫేమ్ అనంతిక ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఫణీంద్ర నరిశెట్టి తెరకెక్కించాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్, పాటలు చూస్తుంటే ఓ పొయొటిక్ లవ్ స్టోరీ అనిపిస్తోంది. ఇలాంటి చిత్రాలు మౌత్ టాక్ తో మెప్పిస్తే తర్వాత థియేటర్స్ కు ఆడియన్స్ ను రప్పించే సత్తా కలిగి ఉంటాయి. కాకపోతే సినిమాకు పెద్దగా పోస్టర్ వాల్యూ కనిపించడం లేదు. డైలాగ్స్ మాత్రం మనసుకు హత్తకునేలా ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది చూడాల్సి ఉంది.

ఈ తెలుగు సినిమాలతో పాటు తెలుగులో కూడా డబ్ అయి విడుదలవుతున్న హిందీ చిత్రం సితారే జమీన్ పర్. ఆమిర్ ఖాన్, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్ చాలా బావుందనే టాక్ తెచ్చుకుంది. కానీ ప్రస్తుతం ఆమిర్ ఖాన్ డౌన్ ఫాల్ లో ఉన్నాడు. అందుకే సినిమాకు బజ్ లేదు. తెలుగులోనే కాదు.. హిందీలోనూ ఇదే పరిస్థితి. అంచేత ఓపెనింగ్స్ పై గట్టి ప్రభావం పడొచ్చు. కంటెంట్ బావుండి.. టాక్ కూడా పాజిటివ్ గా వస్తే అప్పుడు సితారే జమీన్ పర్ కు జనం రావొచ్చు.

మొత్తంగా ఈ మూడు చిత్రాలతో జూన్ నెల కాస్త సందడిగా కనిపిస్తోందని చెప్పాలి. మూడూ విజయం సాధిస్తే.. ఇండస్ట్రీకీ మంచిది. నెక్ట్స్ వీక్ కన్నప్ప విడుదలవుతోంది.ఈ విజయాలు ఆ సినిమాకూ బూస్ట్ ఇస్తాయనడంలో సందేహం లేదు.

Tags

Next Story