Toxic Movie : టాక్సిక్ కొత్త రిలీజ్ డేట్ కు వెళుతుందా..?

ధురంధర్ 2 దెబ్బకు అన్ని రిలీజ్ డేట్లు అతలాకుతలం అవుతున్నాయి. ఈ మూవీ కేవలం హిందీలో విడుదలై 1000 కోట్లు కొల్లగొట్టింది. అంటే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవచ్చు. డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీకి రెండో పార్ట్ కూడా సిద్ధం అవుతోంది. ఈ మూవీని మార్చి 19న విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు. దీనికి తోడు ఈ సారి ప్యాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో సినిమా విడుదల చేస్తున్నారు. ఈ కారణం ఆల్రెడీ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్ అన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఆల్రెడీ పెద్ది ఏప్రిల్ 30కి వెళ్లిపోయింది. అడివి శేష్ డెకాయిట్ ఏప్రిల్ 10 అంటున్నారు. ద ప్యారడైజ్ మాత్రం కొత్త రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేదు. అయితే ఇవన్నీ కాకుండా కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తోన్న టాక్సిక్ మూవీ విషయంలో మాత్రం హాట్ టాపిక్ గా అయింది.
టాక్సిక్ మూవీని కూడా మార్చి 19నే విడుదల చేయాలనుకున్నారు. బట్ ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. అసలే మాత్రం అంచనాలేం కనిపించడం లేదు. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ కూడా మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. ఆ కారణంగా ఈ మూవీపై ఎలాంటి క్రేజ్ క్రియట్ కావడం లేదు. ఈ కారణంగా యశ్ కూడా కాస్త ఆందోళనగా ఉన్నట్టు టాక్ ఉంది. అసలే మాత్రం పాజిటివ్ టాక్ లేకుండా ఈ స్థాయి మూవీ రిలీజ్ చేయడం అనేది బిగ్గెస్ట్ రిస్క్ అనుకుంటున్నారు. ఆ కారణంగా ఈ మూవీని ధురంధర్ 2తో పోటీగా నిలిపితే మొత్తానికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయితే ధురంధర్ తో పోటీ పడటం శ్రేయస్కరం అని అర్థం అవుతోంది. ఆ కారణంగా టాక్సిక్ కొత్త రిలీజ్ కు వెళ్లే ఆలోచనలో ఉంది. మాగ్జిమం ఈ మూవీని పోస్ట్ పోన్ చేయబోతున్నారు అనేది తెలుస్తోంది. మరి కొత్త రిలీజ్ డేట్ అంటే ఎప్పుడు వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
