Vijay : పెళ్లి తర్వాతైనా విజయ్ కెరీర్ మారుతుందా..?

చాలా చిన్నగా కెరీర్ మొదలు పెట్టాడు విజయ్ దేవరకొండ. అతని ప్రయాణం ఎక్కడికి వెళుతుంది అని ఎవరూ అనుకోలేదు. అంటే ఆ స్థాయిలో జర్నీ మొదలు పెట్టాడు. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీస్ లో చేసింది చాలా చిన్న పాత్రలే. ఆపై ఎవడే సుబ్రహ్మణ్యం బాగా గుర్తింపు తీసుకువచ్చింది. మెయిన్ హీరో నానినే అయినా తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. బట్ సోలో హీరోగా పెళ్లి చూపులు తర్వాత ఓవర్ నైట్ ఫేమ్ అయ్యాడు. ఈ మూవీ ఊహించని విజయం సాధించింది. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ మూవీలో అతని నటనకు జనం జేజేలు పలికారు. అర్జున్ రెడ్డిపై కొన్ని కాంట్రవర్శీలు కూడా వచ్చాయి. అయితేనే సినిమా అఖండ విజయం సాధించింది. ఈ చిత్రంతో దర్శకుడు సందీప్ రెడ్డి, హీరోగా విజయ్ దేవరకొండ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఒకట్రెండు చిన్న సినిమాలు టక్సీవాలాతో విజయం వచ్చినా గీత గోవిందంతో ఏకంగా 100 కోట్ల హీరోగా మారాడు విజయ్. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నాం అంటే.. ఇవాళ విజయ్ దేవరకొండ బర్త్ డే.
గీత గోవిందం తర్వాత అతను ట్రాక్ తప్పాడు. బట్ నటన విషయంలో మాత్రం ఇప్పటి వరకూ విమర్శలు రాలేదు. నటన బావుంది. కానీ ఎంచుకున్న కథలే ఇబ్బంది పెడుతున్నాయి. డియర్ కామ్రేడ్ బానే ఉంది. కానెందుకో కమర్షియల్ గా విజయం సాధించలేదు. వరల్డ్ ఫేమస్ లవర్ థీమ్ ఓకే. బట్ నాట్ హిట్. అయినా అతని ఇమేజ్, క్రేజ్ మాత్రం నెక్ట్స్ లెవల్ లో పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అందుకు కారణం లైగర్ రిలీజ్ కు ముందు వచ్చిన హంగామా.. హడావిడీ. లైగర్ ప్యాన్ ఇండియా రేంజ్ మూవీ అనే కలరింగ్ వచ్చింది. భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఖాయం అనుకున్నారు. అనుకున్నట్టుగా ఓపెనింగ్స్ వచ్చాయి. బట్ నెక్ట్స్ షోకే అవి ఆగిపోయాయి. ఆ స్థాయిలో దారుణమైన డిజాస్టర్ గా మిగిలిందీ మూవీ.
తర్వాత చేసిన ఖుషీ కమర్షియల్ గా ఓ మోస్తరు విజయం సాధించింది. బట్ ద ఫ్యామిలీ స్టార్, కింగ్ డమ్ పెద్ద డిజాస్టర్లే. ఈ రెంటి మధ్య కల్కి లో గెస్ట్ అప్పీరియన్స్ చేశాడు. ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్ధనతో రాబోతున్నాడు. రణబాలి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న మూవీ. పైగా తన భార్య రష్మిక మందన్నాతో మరోసారి జత కట్టాడు. ఈ మూవీ గ్యారెంటీ బ్లాక్ బస్టర్ అనే కలరింగ్ అయితే ఇప్పటికే వచ్చింది. ఆపై రౌడీ జనార్ధనతో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా రూపొందుతోంది. ఇది కూడా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఇవి కాక రీసెంట్ గా హాయ్ ఫేమ్ శౌర్యుతో ఓ మూవీ ఓకే చేశాడు. ఏదేమైనా ఈ రెండు సినిమాలు మాత్రం చాలా పెద్ద విజయాలు సాధించడం ఖాయం అనే భావనతో ఉన్నాడు. ఆ రెండు సినిమాల రిజల్ట్స్ అతని కెరీర్ ను డిసైడ్ చేస్తాయి అని మాత్రం చాలామంది అనుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ఇకపై అతని కెరీర్ టాప్ గేర్ లో సాగాలని కోరుకుంటూ విజయ్ దేవరకొండకు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతోంది టివి5 ఎంటర్టైన్మెంట్ టీమ్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
