karate kalyani : కొంతమంది కక్షగట్టి తప్పుడు ఫిర్యాదు చేశారు : కరాటే కళ్యాణి తల్లి

karate kalyani : హైదరాబాద్‌లో సినీనటి కరాటే కల్యాణి ఇంటికి చైల్డ్ లైన్ అధికారులు వెళ్లి తనిఖీలు చేశారు. ఆమె అక్రమంగా చిన్నారిని కొనుగోలు చేశారంటూ ఫిర్యాదులు అందడంతో ఆమె ఇంట్లో సోదాలు చేశారు. దీంతో వివరాలు సేకరించేందుకు చైల్డ్ లైన్ అధికారులు ఆమె ఇంటికి చేరుకున్నారు. అయితే ఆ సమయంలో కరాటే కల్యాణి ఇంట్లో లేకపోవడంతో ఇంటిని పరిశీలించి అధికారులు వెనుదిరిగారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఆమె చిన్నారిని చట్టబద్దంగా దత్తత తీసుకున్నారా...? లేక అక్రమంగా పెంచుకుంటున్నారా అనే దానిపై ఆరాతీస్తున్నారు.
కరాటే కళ్యాణి వద్ద ఉన్న పాపను అక్రమంగా దత్తత తీసుకున్నట్లుగా తెలుస్తోందన్నారు చైల్డ్ లైన్ అధికారి మహేష్. చట్టప్రకారమే పాపను దత్తత తీసుకున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. 1098 దయాళ్ కాల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుతో... హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లోని కరాటే కళ్యాణి నివాసంలో తనిఖీలు, విచారణకు వచ్చినట్లు ఆయన తెలిపారు. కళ్యాణి ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లి, తమ్ముడిని ప్రశ్నించామని, వారు సరైన సమాధానాలు చెప్పలేకపోయారన్నారు.
కరాటే కళ్యాణి అక్రమంగా చిన్నారిని కొనుగోలు చేసిందన్న ఆరోపణలను ఆమె తల్లి విజయలక్ష్మి ఖండించింది. తమ కూతురు కళ్యాణిపై కొంతమంది కక్షగట్టి, తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. 12 ఏళ్ల అబ్బాయిని తమ కూతురు పెంచుకుందని, ఇప్పుడు మరొక అమ్మాయిని కూడా పెంచుకుంటోందని ఆమె తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 28న మూడు రోజుల పాపను తీసుకొచ్చి పెంచుకుంటోందని, పాపకు మౌక్తిక అని పేరు పెట్టినట్లు చెప్పారు. గిట్టని వారే ఫిర్యాదు చేశారంటుని కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మి అంటోంది.
కరాటే కళ్యాణి నివాసంపై హైదరాబాద్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దాడులు జరిపారు. పలువురు చిన్నారులను కిడ్పాప్ చేయడంతో పాటు పసిపిల్లలను కొనుగోలు చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. నెలల చిన్నారులను అడ్డుపెట్టుకుని కరాటే కళ్యాణి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. విచారణ కోసం కళ్యాణి నివాసం వద్దకు చేరుకున్న అధికారులు... పోలీసుల సహాయంతో తనిఖీలు చేపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com