Sai madhav Burra : పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సాయి మాధవ్ బుర్రా.. !

Sai madhav Burra : క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి కొంత గ్యాప్ ఏర్పడింది. త్వరలోనే మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీకి డైలాగ్ రైటర్ గా పనిచేస్తోన్న సాయి మాధవ్ బుర్రా సినిమా గురించిన ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అభిమానులు పవన్ ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో ఆయన అలానే కనిపిస్తాడని సాయిమాధవ్ అన్నారు.
హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర ఇప్పటి వరకు చేయని పాత్ర అని వ్యాఖ్యానించారు. పవన్ అలాంటి పాత్రలో, ఇలాంటి జానర్‌లో ఇంతవరకు కనిపించలేదని ఆయన వెల్లడించారు. క్రిష్ పవన్ కళ్యాణ్ ని అత్యద్భుతంగా చూపిస్తారని తెలిపారు.
జానపద నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దక్షిణాది బాషలతో పాటుగా హిందీలో కూడా ఈ మూవీ రిలీజ్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com