Oscars 2022: 'రైటింగ్ విత్ ఫైర్'.. ఆస్కార్‌లో భారతీయ సినిమాకు ఉన్న ఒకేఒక్క ఆశ..

Oscars 2022: సినీ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల సంబరాలకు వేళయింది. మార్చి 27న ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఈ ఏడాది వివిధ కేటగిరీల్లో పోటీపడే చిత్రాలు, నటుల వివరాలను ఆస్కార్ నామినేషన్ అకాడమీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాల్లో వందల చిత్రాలు స్క్రీనింగ్ రాగా.. వీటిలో ఉత్తమమైన సినిమాల తుది జాబితాను ప్రకటించింది.
ఇక ఆస్కార్ నామినేషన్‌లో ఎంట్రీ ఖాయమనుకున్న భారతీయ చిత్రాలకు మరోసారి నిరాశ తప్పలేదు. అకాడమీ అవార్డులకు నటుడు సూర్య నటించిన చిత్రం జై భీమ్‌తో పాటు మోహన్‌లాల్ పాన్ ఇండియా మూవీ మరక్కార్ షార్ట్‌లిస్ట్ అయ్యాయి. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 276 చిత్రాలు పోటీ పడగా.. ఈ రెండు సినిమాలను స్క్రీనింగ్ వేశారు.
దీంతో తుది జాబితాలో జైభీమ్ చిత్రం ఉంటుందని అందరూ ఆశగా ఎదురుచూశారు. అయితే జైభీమ్ ఆశలపై అకాడమీ చిత్రాల ఎంపిక కమిటీ నీళ్లు చల్లింది. భారత్తరపున.. ఖబర్లహారియా అనే పత్రికను నిర్వహిస్తున్న దళిత మహిళల కథ స్ఫూర్తిగా తెరకెక్కిన రైటింగ్విత్ ఫైర్ డాక్యుమెంటరీ.. ఆస్కార్‌కు బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌గా నామినేటైంది.
ఉత్తమ చిత్రం విభాగంలో బెల్‌ఫాస్ట్, కోడా, డోన్ట్ లాకప్, డ్రైవ్ మై కార్, డ్యూన్, కింగ్ రిచర్డ్, లికోరైస్ పిజా, నైట్‌మేర్ అల్లీ, ది పవర్ ఆఫ్ ది డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ సినిమాలు పోటీపడుతున్నాయి. అలాగే ఉత్తమ నటీనటులు, దర్శకులు, సహాయ నటీనటులు, ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే, సాంగ్.. ఇలా ఆయా విభాగాల్లో పలువురు నామినేషన్ వేశారు. ఇక ఈసారి అత్యధికంగా పవర్ ఆఫ్ డాగ్ చిత్రం 12 విభాగాల్లో నామినేట్ అయింది.
జేన్ కామ్పియోన్ తెరకెక్కించిన ఈ పవర్ ఆఫ్ డాగ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. పవర్ ఆఫ్ డాగ్తర్వాత అత్యధిక నామినేషన్లు అందుకున్న చిత్రంగా డ్యూన్నిలిచింది. డెనిస్విల్లీనేయూవ్ దర్శతక్వంలో సైన్స్‌ఫిక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 10 విభాగాలకు నామినేట్అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com