NTR Yamadonga : యమదొంగ బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఆ రోజే

NTR Yamadonga :  యమదొంగ బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఆ రోజే
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన మూవీ యమదొంగ రీ రిలీజ్ కాబోతోంది. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన మూడో సినిమా ఇది. యమదొంగకు ముందు ఎన్టీఆర్ కాస్త డౌన్ ఫాల్ లో ఉన్నాడు. రాజమౌళి కాంబోతో ఉన్న క్రేజ్ తో పాటు యముడుగా మోహన్ బాబు చేసిన పాత్ర ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయ్యింది. యముడు, చిత్రగుప్తుడు, మానవుడు అనే కాన్సెప్ట్ లోనే ఇప్పటి వరకూ వచ్చిన చాలా సినిమాల టెంప్లేట్ నే రాజమౌళి మరోసారి ఫాలో అయ్యాడు. పెద్దగా కొత్తదనం కనిపించదు కానీ.. యముడుగా ఎన్టీఆర్ చేసిన పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది. పెద్దాయన ఎన్టీఆర్ ను గ్రాఫిక్స్ లో రీ క్రియేట్ చేయడం.. ఆయనతో యమలోకంలో స్టెప్పులు వేయించడం చాలామందికి బాగా నచ్చింది. ఇక ఎన్టీఆర్ డైలాగ్స్ మరో హైలెట్. మోహన్ బాబు నటన సూపర్బ్ అనిపించుకుంది.

ప్రియమణి హీరోయిన్ గా నటించిన యమదొంగలో రంభ చేసిన ఐటెమ్ సాంగ్, ఆ పాటలో ఎన్టీఆర్ స్టెప్పులు విజిల్స్ వేయించాయి. అలాగే మమతా మోహన్ దాస్ స్పెషల్ రోల్ సైతం అదిరిపోతుంది. అలీ కామెడీ ఆకట్టుకుంటుంది. మొత్తంగా కంప్లీట్ కమర్షియల్ ప్యాక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా 18నే రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 9 నుంచి బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి. సింహాద్రితో అనుకున్న ఫీట్ ను సాధించలేకపోయారు ఫ్యాన్స్. బట్ ఈ సారి కలెక్షన్స్ పరంగా రికార్డ్ సృష్టించాలనుకుంటున్నారు. మరి వారి కోరిక నెరవేరుతుందా లేదా అనేది 9 నుంచి ఓపెన్ కాబోతోన్న బుకింగ్స్ చెబుతాయి.

Tags

Next Story