Yami Gautam: 'ఇకపై నా పర్ఫార్మెన్స్‌ను రివ్యూ చేయవద్దు'.. నెగిటివిటీపై నటి స్ట్రాంగ్ కౌంటర్..

Yami Gautam (tv5news.in)
Yami Gautam: మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. పలు బ్యూటీ ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా చేసి ఆ తర్వాత నటిగా మారింది యామి గౌతమ్. మొదట్లో సినిమా అవకాశాలు అందుకోవడంలో స్లో అయిన యామి.. ఇప్పుడిప్పుడే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. అలాంటి యామి యాక్టింగ్‌పై ఓ నేషనల్ వెబ్‌సైట్ నెగిటివ్ రివ్యు ఇచ్చింది. దీనికి యామి స్ట్రాంగ్ కౌంటర్‌తో ట్వీట్లు చేసింది.
యామి గౌతమ్ బాలీవుడ్‌కు వచ్చిన కొత్తలో కొన్ని సినిమాల్లో అర్థాంతరంగా మరణించే పాత్రలు చేసింది. దానిని గుర్తుచేసుకుంటూ ఓ నేషనల్ మీడియా వ్యంగ్యంగా రివ్యూ ఇచ్చింది. అభిషేక్ బచ్చన్‌తో యామి చేసిన సినిమా 'దస్వీ'కు ఆ వెబ్‌సైట్ రివ్యూ ఇస్తున్న సమయంలో ఈ విషయం గురించి ప్రస్తావించింది. అయితే ఆ వ్యాఖ్యలను హైలెట్ చేసి యామి వాటికి సరైన రిప్లై ఇచ్చింది.
'నేను ఏమైనా చెప్పే ముందు నేను సరైన విమర్శలను స్వీకరిస్తాను. కానీ ప్రత్యేకంగా ఒక ప్లాట్‌ఫార్మ్ మనల్ని కిందకి లాగాలని ప్రయత్నిస్తున్నప్పుడు దీనిపై మాట్లాడడం అవసరం అనిపించింది' అని ఆ రివ్యూపై ట్వీట్ చేసింది యామి. 'నా లేటెస్ట్ సినిమాలు 'బాలా', 'ఏ థర్స్‌డే', 'ఉరి' లాంటి వాటిల్లో నా నటన చూసిన తర్వాత కూడా నా పనికి ఇలాంటి ఒక రివ్యూ ఇవ్వడం చాలా అమర్యాదగా ఉంది'. అని ట్వీట్ చేసింది.
FC Review: #Dasvi is like a sanitized Adam Sandler comedy gone wrong, which is saying a lot, because Adam Sandler comedies are wrong to begin with. Here's @ReelReptile's take on the #Netflix film. #AbhishekBachchan #NimratKaur https://t.co/UbRh0wqX3V
— Film Companion (@FilmCompanion) April 7, 2022
'అందరికీ, ముఖ్యంగా నాలాగా ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చినవారికి ప్రతి అవకాశంతో నిరూపించుకొని నిలబడడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కానీ ఇంత చేసిన తర్వాత కూడా ఇలాంటి పేరున్న వెబ్‌సైట్స్ నుండి మాకు లభించేది ఇదే.' అని చెప్పింది యామి గౌతమ్. అంతే కాకుండా తన పర్ఫెర్మెన్స్‌ను ఇకపై రివ్యూ చేయవద్దని ఆ వెబ్‌సైట్‌కు తెలిపింది.
It takes years of hard work for anyone & especially a self-made actor like me to keep proving our mettle again & again with every opportunity. This is what it comes down to from certain reputed portals!
— Yami Gautam Dhar (@yamigautam) April 7, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com