Yami Gautam: బాలీవుడ్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌పై హ్యాకర్ల కన్ను..

Yami Gautam (tv5news.in)
X

Yami Gautam (tv5news.in)

Yami Gautam: ఈమధ్యకాలంలో ఎక్కువగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల సోషల్ మీడియా అకౌంట్లపై హ్యాకర్లు దృష్టిపెడుతున్నారు.

Yami Gautam: ఈమధ్యకాలంలో ఎక్కువగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల సోషల్ మీడియా అకౌంట్లపై హ్యాకర్లు దృష్టిపెడుతున్నారు. ఇటీవల ఓ బాలీవుడ్ బ్యూటీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని వెల్లడించింది. అందుకే అందరూ అలర్ట్‌గా ఉండాలంటూ ట్వీట్ చేసింది. ఆ బాలీవుడ్ భామ మరెవరో కాదు.. యామి గౌతమ్.

ముందుగా మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన యామి గౌతమ్.. పెద్ద పెద్ద బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించింది. అదే క్రమంలో తనకు హిందీ నుండి అవకాశాలు రావడం మొదలయ్యింది. అక్కడ హీరోయిన్‌గా చేసిన మొదటి చిత్రం 'విక్కీ డోనర్‌'తోనే విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది యామి. తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసినా బాలీవుడ్‌లో కలిసొచ్చినంతగా తనకు టాలీవుడ్‌లో కలిసి రాలేదు.

యామి గౌతమ్ తాజాగా ఒక ట్వీట్ చేసింది. 'నిన్నటి నుండి నేను నా ఇన్‌స్టా్గ్రామ్ అకౌంట్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నాను. బహుశా అది హ్యాక్ అయ్యిందేమో. మేము అది ఎంత వీలైతే అంత త్వరగా రికవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అప్పటిలోపు నా అకౌంట్‌లో ఏదైనా అనుమానస్పదంగా అనిపిస్తే జాగ్రత్త' అని ట్విటర్‌లో తెలిపింది యామి గౌతమ్.

Tags

Next Story