Yami Gautam: దర్శకుడిని పెళ్లాడిన ప్రముఖ నటి

Yami Gautam: బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమి పెళ్లి చేసుకుని అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. 'ఉరి: ద సర్జికల్ స్ట్రైక్' వంటి సూపర్ హిట్ మూవీని అందించిన దర్శకుడు ఆదిత్యతను యామీ పెళ్లాడింది. కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ వివాహ వేడుకును కొద్ద మంది అతిధుల సమక్షంలో నిర్వహించారు.
ఇరు కుటుంబాలకు సంబంధించిన అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని యామీ గౌతమి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టానంటూ భర్తతో కలిసి దిగిన ఫోలోని షేర్ చేసింది. ఆదిత్య ప్రస్తుతం విక్కీ కౌశల్ హీరోగా ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ సినిమా తీస్తున్నారు.
యామీ గౌతమి ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో ప్రేక్షకులకు పరిచయమవగా 'ఉల్లాస ఉత్సాహ' అనే కన్నడ చిత్రంతో వెండితెరపై మెరిసింది. విక్కీ డోనర్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యామీ ఈ చిత్రంలోని తన నటని గాను ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.
ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీకి పెళ్లైపోయింది..దర్శకుడిని పెళ్లాడిన ప్రముఖ నటిఇక తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమైన యామి నువ్విలా, గౌరవం, యుద్ధం చిత్రాల్లో నటించింది. నితిన్ సరసన కొరియర్ బాయ్ కళ్యాణ్ లో నటించింది. ప్రస్తుతం ఆమె భూత్ పోలీస్, దస్వి, ఎ థర్స్ డే చిత్రాల్లో నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com