సినిమా

ప్రధానికి లేఖ రాసిన 'యష్' ఫ్యాన్స్.. సినిమా రిలీజ్ రోజున..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖ సారాంశం.. ప్రజలు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రధానికి లేఖ రాసిన యష్ ఫ్యాన్స్.. సినిమా రిలీజ్ రోజున..
X

ఆ హీరో మీద అభిమానం వాళ్లకి పీక్స్‌లో ఉంది. హడావిడిగా ఆఫీస్ నుంచి సినిమాకి వెళితే అందులో మజా రాదు. అదే ఆరోజు హాలిడే ఉంటే హ్యాపీగా వెళ్లి తమ అభిమాన హీరో సినిమా తనివి తీరా చూడొచ్చు. ఆధ్యంతం ఆస్వాదించొచ్చు. మరి ఆరోజు సెలవు లేదే.. ఏం చేయాలి చెప్మా అంటూ ఓ ఆలోచన చేశారు.

ఆఫీస్ బాస్‌ని అడిగితే ఉపయోగం లేదని భావించి ఏకంగా దేశ ప్రధానికే ఓ లేక రాసి పారేశారు. జూలై 16న మా హీరో యష్ చిత్రం చాప్టర్ 2 రిలీజవుతోంది.. మాయందు దయ వుంచి ఆరోజు నేషనల్ హాలిడే ప్రకటిస్తే ఎంచక్కా సినిమా చూసుకుంటాం అంటూ మోదీకి లేఖ రాశారు. ఓ సినిమా చూడ్డానికి నేషనల్ హాలిడేని ప్రకటించమంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారంటే యష్ మీద ఫ్యాన్స్‌కి ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖ సారాంశం.. ప్రజలు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మా భావాలను అర్థం చేసుకుని ఆ రోజు అనగా శుక్రవారం 16.07.2021 జాతీయ సెలవు దినం ప్రకటించమని కోరుతున్నాం. ఇది సినిమా మాత్రమే కాదు మా ఎమోషన్ కూడా దయచేసి అర్థం చేసుకోరూ అంటూ మోదీకి లేఖ రాశారు.

కాగా చాఫ్టర్ 2 చిత్రంలో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. యష్ పక్కన హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్‌న్మెంట్‌లో మరో ముఖ్య పాత్రధారి సంజయ్ దత్. రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా స్వరాలు సమకూరుస్తున్నారు.

Next Story

RELATED STORIES