Sai Pallavi : సాయి పల్లవి సీత పాత్ర చేయడం లేదా..
మన దేశంలో పౌరాణికాలు తీయాలంటే తెలుగోళ్లే తీయాలి అనే సామెత ఉంది. మనం తప్ప ఎవరు తీసినా అంత గొప్పగా అనిపించవు అంటారు. అందుకు మన మేకర్స్ ఎప్పటికీ గొప్పవాళ్లుగానే మిగిలిపోతారు. ఆ మధ్య బాలీవుడ్ లో వచ్చిన ఆదిపురుష్ మేకింగ్ పరంగా అభాసుపాలైంది. ప్రభాస్ రాముడుగా నటించినా జనం యాక్సెప్ట్ చేయలేకపోయారు అంటే కారణం.. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్. ఇవన్నీ ఎలా ఉన్నా.. పురాణాలను బలంగా చెప్పే టెక్నిక్ తెలుగువాళ్లకే ఎక్కువగా ఉందంటారు. అయినా బాలీవుడ్ లో మరోసారి రామాయణం తెరకెక్కబోతోంది.
రణ్ బీర్ కపూర్ రాముడుగా నటించబోతున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ యశ్... రావణుడుగా నటిస్తూ ఈ ప్రాజెక్ట్ లో నిర్మాణ భాగస్వామి కూడా అయ్యాడు. దీంతో ఈ రామాయణానికి మరింత క్రేజ్ వచ్చింది. సీతగా సాయి పల్లవిని తీసుకున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిందంటూ ఆ మధ్య కొన్ని స్టిల్స్ వైరల్ అయ్యాయి. బట్ ఈ మూవీలో ఇంకా సాయి పల్లవి ఎంట్రీ ఇవ్వలేదని చెప్పి షాక్ ఇచ్చాడు యశ్.
రాముడుగా రణ్ బీర్, రావణుడుగా తను ఓకే కానీ.. ఇంకా సాయి పల్లవి అఫీషియల్ గా ఓకే చెప్పలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి ఆ ఫోటోస్ ఎలా వచ్చాయో కానీ.. యశ్ చెప్పింది విని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. నిజంగా సీత పాత్రకు సాయి పల్లవి అద్భుతంగా సెట్ అవుతుందనుకున్నవారిని డిజప్పాయింట్ చేసే వార్త ఇది. అయితే దర్శకుడు నితేష్ తివారీ మాత్రం సాయి పల్లవినే తీసుకుంటా అన్నాడట. ఇది మంచి ఛాయిస్ అని తను చెప్పినట్టు యశ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. సో.. ఇంకా ఈ ప్రాజెక్ట్ లోకి సీతగా సాయి పల్లవి తన నిర్ణయం చెప్పలేదని దీన్ని బట్టి అర్థం అవుతోంది. అయితే సడెన్ గా వైరల్ అవుతోన్న ఈ ఇంటర్వ్యూ ఇప్పటిదా లేక పాతదా అనేది కూడా తేలాల్సి ఉంది. పాతదే అయితే మాత్రం రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా ఉన్న ఫోటో నిజమే అనుకోవాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com