KGF 2: 'కేజీఎఫ్ 2'లో అదే హైలెట్..! బయటపెట్టిన యశ్..

KGF 2: కేజీఎఫ్ 2లో అదే హైలెట్..! బయటపెట్టిన యశ్..
KGF 2: కేజీఎఫ్ 2 త్వరలోనే విడుదల కావాల్సి ఉండగా యశ్.. తిరుపతిలో శ్రీవారిని సందర్శించుకుని మీడియాతో కాసేపు ముచ్చటించారు.

KGF 2: కన్నడ సినీ పరిశ్రమను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన విషయంలో చాలావరకు క్రెడిట్ హీరో యశ్‌కు కూడా దక్కుతుంది. ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్' లాంటి ఓ పాన్ ఇండియా కథను రాసుకున్నా కూడా అందులో యాక్టింగ్ పరంగా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించగలిగాడు యశ్. ఒక కేజీఎఫ్ రెండో భాగం త్వరలోనే విడుదల కావాల్సి ఉండగా యశ్.. తిరుపతిలో శ్రీవారిని సందర్శించుకుని అక్కడి మీడియాతో కాసేపు ముచ్చటించారు.

తిరుపతికి రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నాడు యశ్. కర్ణాటక, ఆంధ్రుల మధ్య అనుబంధం ఎంతో ప్రత్యేకం అన్నాడు. కేజీఎఫ్ ముందు నుండి తన చిత్రాలను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు యశ్. అంతే కాకుండా తన తెలుగులో ఏమైనా తప్పులు ఉండే మన్నించండి అంటూ విలేఖరులను క్షమాపణ కూడా కోరాడు.

కేజీఎఫ్ చాప్టర్ 2 తరహాలో తమిళ హీరో విజయ్ నటించిన బీస్ట్ కూడా పాన్ ఇండియా సినిమానే. అయితే ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకేరోజు తేడాతో విడుదల కానున్నాయి. దీనిపై యశ్ స్పందన ఏంటి అని ప్రశ్నించగా.. రెండు సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు యశ్. అంతే కాకుండా కేజీఎఫ్ కంటే కేజీఎఫ్ 2లోనే మథర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా బయటపెట్టేశాడు. ఇక కేజీఎఫ్ 2లో మథర్ సెంటిమెంట్ సినిమాకు హైలెట్ అని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story