Yashoda Teaser: 'యశోద' టీజర్ రిలీజ్.. సమంత యాక్షన్ సూపర్

Yashoda Teaser: యశోద టీజర్ రిలీజ్.. సమంత యాక్షన్ సూపర్
Yashoda Teaser: గత కొన్ని రోజులుగా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది.. కారణం తెలియదు కానీ.. యశోదగా వస్తున్న సమంత కొత్త చిత్రం టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Yashoda Teaser: గత కొన్ని రోజులుగా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది.. అయితే సమంత నటించిన కొత్త చిత్రం యశోద టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఫస్ట్ లుక్ విడుదల చేసిన చాలా రోజుల తర్వాత టీజర్ విడుదల చేసి సమంత ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు దర్శక నిర్మాతలు. ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తున్న ఈ చిత్రంలో డాక్టర్ తగు జాగ్రత్తలు చెబుతుంటుంది.. ఎలా ఉండాలి, ఏం తినాలి లాంటి విషయాలు.. కానీ పరిస్థితులు ఆమెకు అనుకూలంగా ఉండవు..

హరి హరీష్ దర్శకత్వంలో వస్తున్న యశోద చిత్రంలో యాక్షన్, ఎమోషన్ అంశాలు ప్రధానంగా ఉన్నాయి. టీజర్.. యశోద సినిమాపై హైప్‌ను క్రియేట్ చేస్తుంది. లేడీ ఓరియంటెడ్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ తదితరులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌లో అద్భుతమైన నటనను కనబరిచిన సమంత ఏ పాత్రనైనా ఛాలెంజింగ్‌గా తీసుకొని చేస్తుంది. యశోద సినిమా కోసం సమంత ఫ్యాన్స్ వెయిటింగ్.

Tags

Read MoreRead Less
Next Story