Yash's Toxic : ఓటిటి డీల్ లేకుండానే టాక్సిక్

Yashs Toxic :  ఓటిటి డీల్ లేకుండానే టాక్సిక్
X

కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా నటించిన మూవీ టాక్సిక్. ఈ మూవీ మార్చి 19నే విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అది ఓటిటి డీల్ సెట్ కాలేదు. అలాగే మూవీ అవుట్ పుట్ పై హీరో అన్ శాటిస్ఫైడ్ గా ఉన్నాడు. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ అస్సలు బాలేదు అని చెప్పాడట. ఆ కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ గా జూన్ 4న అని చెప్పారు. అంటే ఓ రెండు నెలలకు పైగా టైమ్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఈ మూవీ ఓటిటి డీల్ ఇప్పటి వరకు సెట్ కాలేదు. మామూలుగా ప్యాన్ ఇండియా హీరోల మూవీస్ అంటే ఈ డీల్స్ వెంటనే పూర్తవుతాయి. అలాగే ఈ మూవీ టీజర్ కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ తర్వాతైన డీల్ సెట్ అయిందా అంటే అవుతుంది. బట్ హీరో యశ్ ఈ డీల్ ను సెట్ కానివ్వడం లేదట.

టాక్సిక్ లాంటి భారీ బడ్జెట్ లాంటి మూవీ ఓటిటి డీల్ కాకుండా ఉంటుందా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. కానీ ఆ డీల్ సెట్ కాకపోవడం కారణం యశ్ అంటే ఆశ్చర్యం కలుగుతుంది.ఎందుకంటే ఈ మూవీకి ఓటిటి డీల్ గా యశ్ ఏకంగా 200 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నాడట. 200 కోట్లు అంటే మాటలు కాదు. గీతూ మోహన్ దాస్ లాంటి దర్శకురాలు కూడా అందుకు ఓ కారణం. ఆమె చేసిన మూవీస్ అంత గొప్పగా ఏం ఉండవు. అలాంటి తను డైరెక్ట్ చేసిన మూవీకి అంత భారీ అమౌంట్ పెట్టడం కష్టం. అయినా ఓటిటి వాళ్లు 100 - 120 కోట్ల వరకు పెట్టేందుకు సిద్దంగా ఉన్నారు. బట్ యశ్ మాత్రం 200 కోట్లు అని ఖరాఖండీగా చెబుతున్నాడు. అంతకు తగ్గితే ఇవ్వను అంటున్నాడు. దీంతో ఓటిటి వాళ్లు సైలెంట్ అవుతున్నారు.

ఈ కారణంగా అసలు ముందే ఓటిటికి ఇవ్వకుండా ఉండాలని యశ్ భావిస్తున్నాడట. సినిమా రిలీజ్ తర్వాత టాక్ ను బట్టి ఆ మొత్తం రాబట్టాలని అతను అనుకుంటున్నాడు. మామూలుగా కేజీఎఫ్ కూ అంతే కదా. ఓటిటికి భారీ డీల్ సెట్ కాలేదు. అలాగే శాటిలైట్ కూడా కాలేదు. అయినా ఈ మూవీని అలాగే విడుదల చేశారు. తర్వాత వాళ్లు చెప్పిన అమౌంట్ కు తర్వాత ఓకే చేశారు. ముఖ్యంగా కేజీఎఫ్ యేడాది తర్వాతే టివిల్లో వేశారు అంటే అప్పటి వరకు భారీ అమౌంట్ కోసం ఆగాల్సి వచ్చింది. మొత్తంగా యశ్ ఒప్పుకుంటేనే ఓటిటి డీల్ అవుతుంది. లేదంటే ప్రస్తుతానికైతే ఇది హోల్డ్ లో ఉన్నట్టుగానే భావించాలి.

Tags

Next Story