Yash's Toxic : టాక్సిక్ .. రిలీజ్ డేట్ మారుతుందా..?

Yashs Toxic :  టాక్సిక్ .. రిలీజ్ డేట్ మారుతుందా..?
X

టాక్సిక్.. కేజీఎఫ్ 2 తర్వాత యశ్ హీరోగా నటించిన సినిమా. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిందీ మూవీని. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ చూసిన మైండ్ బ్లాక్ అయింది ప్రతి ఒక్కరికి. ఆ స్థాయిలో హీరో క్యారెక్టర్ ను ప్రెజెంట్ చేసింది దర్శకురాలు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న మూవీ ఇది. ఈ మేరకు చాలామంది ఫీమేల్ లీడ్స్ లో కనిపించబోతున్నారు. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, టోవినో థామస్ వంటి భారీ తారాగణం కనిపిస్తోంది ఈ మూవీలో. ఇంతమంది ఆర్టిస్ట్ లు ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారో అనే క్యూరియాసిటీ కూడా కనిపిస్తోంది. ఓ రకంగా కేజీఎఫ్ తర్వాత యశ్ మరోసారి ఆ స్థాయిలో ప్యాన్ ఇండియా మూవీగా చేయబోతున్నట్టు కనిపిస్తోంది. లేడీ డైరెక్టర్ కాబట్టి ఏదో ఆ తరహా మూవీ చేస్తుంది అనడానికి లేదు అనిపించింది టీజర్ తో. ప్రాపర్ గా వాల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ ను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది.

ఇక ఈ మూవీ మార్చి 19న విడుదల చేయబోతున్నారు. అయితే అదే రోజు ధురంధర్ 2 కూడా విడుదల అవుతుంది. ఆల్రెడీ ధురంధర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలాంటి మూవీకి సీక్వెల్.. అది కూడా వెంటనే అంటే ఆడియన్స్ లో తిరుగులేని క్రేజ్ ఉంటుంది. ఆ కారణంగా టాక్సిక్ మూవీని అదే రోజు విడుదల చేయడం కష్టం అని భావించారు. దీనికి తోడు టాక్సిక్ కు బిజినెస్ పరంగా ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు అనే టాక్ కూడా ఉంది. దీంతో పాటు ఈ మూవీపై పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా క్రేజ్ రావడం లేదు అని కూడా అంటున్నారు. ఆ కారణంగా టాక్సిక్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పారు. బట్ అందులో ఏ నిజం లేదు.

టాక్సిక్ మూవీ ముందు చెప్పినట్టు డేట్ కే విడుదల కాబోతోంది. ఈ మేరకు మూవీ టీమ్ నుంచి వస్తోన్న ప్రతి అప్డేట్ తో పాటు రిలీజ్ డేట్ కూడా పక్కాగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ధురంధర్ 2 ఉన్నా కూడా తాము తగ్గేదే లే అనేలా టాక్సిక్ మూవీ రిలీజ్ డేట్ లో ఏ మార్పూ ఉండదు అని తేల్చి చెబుతున్నారు. మరి బిజినెస్ ల పరంగా అంటే టైమ్ ఉంది కాబట్టి ఆ టైమ్ కు అంతా సెట్ అవుతుంది అని అంటున్నారు. సో.. ఈ మధ్య టాక్సిక్ పోస్ట్ పోన్ రూమర్స్ ను ప్రస్తుతానికి అయితే కొట్టి పడేస్తున్నారు. ఆ మూవీ ఆ డేట్ కే వస్తుందని ఖచ్చితంగా చెబుతున్నారు.

Tags

Next Story