Naveen Mullangi: కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్- క్యాపిటలిస్ట్ బాయ్ ఫ్రెండ్

Naveen Mullangi: కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్- క్యాపిటలిస్ట్ బాయ్ ఫ్రెండ్
X
Naveen Mullangi: టైటిల్ అయితే అదిరింది. మరి కంటెంట్ ఎలా ఉంటుందో..

Naveen Mullangi: టైటిల్ అయితే అదిరింది. మరి కంటెంట్ ఎలా ఉంటుందో..ఏది ఏమైనా యంగ్ అండ్ ఎనర్జిటిక్ కుర్రాడు ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఇంగ్లీషులో ఓ ఫీచర్ ఫిల్మ్ చేయడానికి మెగా ఫోన్ చేతబట్టాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.



ఖమ్మంకు చెందిన నవీన్ ముళ్లంగి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేశాడు. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన ప్యాషన్‌కి మెరుగులు దిద్ది సినిమా తీయాలన్న తన కలను సాకారం చేసుకుంటున్నాడు. ఈ చిత్రానికి తనే దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.



విభిన్న భావజాలాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే ప్రేమ కథ ఇది. ఈ చిత్రానికి అవసరమైన పలు సాంకేతిక అంశాల్లోనూ నవీన్ శిక్షణ తీసుకుని తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కలిగిన ఇంగ్లీష్ సినిమాలు తీసి తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాడు. ఇక నవీన్ సరసన హీరోయిన్‌గా శివ ప్రీతిక సుక్క హీరోయిన్‌గా నటిస్తోంది.

Tags

Next Story