Chiranjeevi : సీనియర్ హీరోలకు ఫిక్స్ అయిన యంగ్ డైరెక్టర్స్

యంగ్ హీరోస్ కంటే సీనియర్ హీరోలే ఎక్కువ దూకుడుగా ఉన్నారిప్పుడు. వెటరన్స్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు కూడా. లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు సంక్రాంతికి వస్తున్నాం మూవీతో. మెగాస్టార్ వాల్తేర్ వీరయ్యతో వారెవ్వా అనిపిస్తే.. బాలయ్య అఖండ విజయాలతో అదరగొడుతున్నాడు. ఇక నాగ్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నా.. అతనూ ఫామ్ లోకి వస్తే ఓ పనైపోతుంది. అయితే ఈ సీనియర్ హీరోలకు సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఇస్తున్నది యంగ్ డైరెక్టర్స్ కావడం విశేషం.
మెగాస్టార్ కు వాల్తేర్ వీరయ్యతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబీ.. వెంటనే బాలయ్య కు డాకూ మహారాజ్ తో సూపర్ హిట్ ఇచ్చాడు. అటు బాలయ్యకు వీరి సింహారెడ్డితో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ప్రస్తుతం అతను హిందీలో మరో సీనియర్ హీరో సన్నిడియోల్ తో జాట్ అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత మళ్లీ బాలకృష్ణతోనే ప్రాజెక్ట్ ఓకే అయింది. బాలయ్య ఇప్పుడు అఖండ 2 చేస్తున్నాడు. దీని తర్వాత గోపీచంద్ తోనే ప్రాజెక్ట్ ఉండబోతోంది.
ఇక బాబీ కూడా మళ్లీ తన ఫేవరెట్ హీరో మెగాస్టార్ తో ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడు. బాబీ చెప్పిన స్టోరీకి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా ఈ ఇద్దరు దర్శకులు మెగా, నందమూరి క్యాంప్ లలో అదరగొడుతున్నారు. విశేషం ఏంటంటే.. ఈ రెండు సినిమాలనూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది.
ఇక అనిల్ రావిపూడి వెంకీకి ఇండస్ట్రీ హిట్ ఇచ్చేశాడు కదా. సో.. యంగ్ డైరెక్టర్స్ వెటరన్స్ తో సెంచరీలు కొడుతున్నారన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com