తమిళ్ డైరెక్టర్‌తో రామ్ నెక్ట్స్ సినిమా!

X
By - TV5 Digital Team |22 Jan 2021 9:45 PM IST
రెడ్ సినిమాతో సంక్రాంతికి మంచి హిట్ అందుకున్నాడు యంగ్ హీరో.. రామ్, కిశోర్ తిరుమల-రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతుంది.
రెడ్ సినిమాతో సంక్రాంతికి మంచి హిట్ అందుకున్నాడు యంగ్ హీరో.. రామ్, కిశోర్ తిరుమల-రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఇదిలావుండగా.. రామ్ తదుపరి సినిమా తమిళ దర్శకుడితో ఉంటుందని తెలుస్తోంది. విజయ్-మోహన్ లాల్ కాంబోలో వచ్చిన 'జిల్లా' సినిమా దర్శకుడు ఆర్టీ నీసన్‌తో ఓ యాక్షన్ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే నీసన్ కలిసి కథ విన్పించగా రామ్ ఇంప్రెస్ అయ్యాడట. దీంతో ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుండగా ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ప్రకటన కూడా రానుందట.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com