Sreeleela : శ్రీలీల టాప్ లేపుతుందా..?

ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసిన బ్యూటీ శ్రీలీల. మొదటి సినిమాతోనే రాఘవేంద్రరావు చేతిలో పడింది. ఆయన ఐకనిక్ మూవీ టైటిల్ పెళ్లి సందడిని రీ క్రియేట్ చేస్తూ రూపొందిన ఈ చిత్రంలో ఆయనా నటించడం విశేషం. కమర్షియల్ గా పెళ్లి సందడి పెద్ద విజయం సాధించలేకపోయినా.. శ్రీ లీలలోని ఛలాకీ తనానికి టాలీవుడ్ ఫిదా అయింది. ఆ వెంటనే మాస్ మహరాజ్ రవితేజతో చేసిన ధమాకా ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టింది. ఈ మూవీలో రవితేజ ఎనర్జీకి డబుల్ ఎనర్జీని చూపించింది శ్రీ లీల. కట్ చేస్తే చేతినిండా సినిమాలు. బట్ అవేవీ హిట్ అనిపించుకోలేదు. దీంతో టాప్ గేర్ లో ఉన్న తను ఒక్కసారిగా ఫస్ట్ గేర్ కు రావాల్సి వచ్చింది. పైగా అన్నీ ప్రామిసింగ్ హీరోలతో చేసినవే కావడం కూడా తనకే మైనస్ అయింది. ఇవాళ శ్రీ లీల బర్త్ డే. ఈ సందర్భంగా తన నటిస్తోన్న మూడు సినిమాల నుంచి మూడు స్పెషల్ పోస్టర్స్ విడుదల చేశారు. ఈ సినిమాల విజయాలు శ్రీ లీల రేంజ్ ను డిసైడ్ చేస్తాయి అని చెప్పొచ్చు.
ఈ మూడు సినిమాల్లో మొదటగా విడుదలయ్యేది మళ్లీ రవితేజతో నటించిన మాస్ జాతర. మరోసారి రవితేజ చేతుల మీదుగా బౌన్స్ బ్యాక్ కావాలనే ప్రయత్నాల్లో ఉంది. దీంతో పాటు అక్కినేని అఖిల్ సరస నటిస్తోన్న లెనిన్ మూవీ కూడా ఉంది. ఈ మూవీపై చాలా పాజిటివిటీ ఉంది ఇండస్ట్రీ సర్కిల్స్ లో. ఈ రెండూ కాక ఎప్పుడో కమిట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ఉంది. ఈ సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయింది అనుకున్నారు. బట్ ఈ మధ్య మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. సో.. ఇది శ్రీ లీలకు మరింత ప్లస్ అయ్యే ప్రాజెక్ట్. ఇవి కాక తమిళ్ లో పరాశక్తి, హిందీలో ఆశిఖి 3, కన్నడలో జూనియర్ మూవీస్ లో నటిస్తోందీ మూవీ. మరి ఈ చిత్రాలతో తిరిగి టాప్ ప్లేస్ వరకూ రావాలని కోరుకుంటూ ఈ బ్యూటీకి మనమూ బర్త్ డే విషెస్ చెబుదాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com