Ananta Sriram : ఇదేందయ్యా ఇది.. మీలో ఈ యాంగిల్ కూడా ఉందా అనంతా...!

Ananta Sriram : యువ గేయ రచయిత అనంత శ్రీరామ్ గురించి పెద్దగా తెలియని వారంటూ ఉండరు. చూడడానికి ఆయన చాలా సాఫ్ట్‌గా కనిపిస్తారు.. ఆయన పాటలు కూడా ఆయన లాగే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అయితే అనంత శ్రీరామ్ తన ఇమేజ్‌కి భిన్నంగా కనిపించి ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చాడు.
ఇంతకీ ఏం చేశాడంటే.. అనంత శ్రీరామ్ ప్రేమ పాటలకు పెట్టింది పేరు... ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే పాటల రచయితగా మారిన ఆయన.. అతి చిన్న వయసులోనే మంచి సాహిత్యంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. 37 ఏళ్ల అనంత శ్రీరామ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తాజాగా 17 ఏళ్లు పూర్తి అయ్యాయి.. ఈ సందర్భంగా జీ తెలుగులో 'సరిగమప' అనే ప్రోగ్రాంలో ఓ ఎపిసోడ్‌కి న్యాయనిర్ణేతగా వచ్చారు.
అయితే ఇందులో ఆయన ఎంట్రీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరిలాగే అనంత శ్రీరామ్ కూడా చాలా కామ్‌గా స్టేజ్‌పైకి వస్తాడని అందరూ అనుకున్నారు.. అయితే మెల్లగా నడుచుకుంటూ స్టేజిపైకి వచ్చి డ్యాన్సర్లతో లైట్ మూమెంట్స్ స్టార్ట్ చేశాక ఆయన అదిరిపోయే స్టెప్పులు వేశాడు.. ఆయన స్టెప్పులు చూసి అక్కడన్న వారంతా షాక్ అయ్యారు.. ఓ డాన్స్ మూమెంట్‌లో అయితే ఏకంగా గాల్లోకి ఎగిరాడు.. ఈ వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయగా ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఎప్పుడూ సాఫ్ట్‌గా కనిపించి బాగా మాట్లాడే అనంత శ్రీరామ్‌లో ఈ యాంగిల్‌ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మాటలు, పాటలతోనే కాకుండా వీలైతే డ్యాన్స్‌తోనూ ఆదరగోడతానని చెప్పకనే చెప్పారు అనంత శ్రీరామ్. ఆ స్టెప్పులు చూస్తుంటే కాలేజీ రోజుల్లో డ్యాన్స్ చేసిన అనుభవం ఉన్నట్టుంది. అందుకే ఇలాంటి స్టెప్పులతో అదరగొట్టారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
😵💫😵💫😵💫 pic.twitter.com/zkiumeUuWI
— .... (@ynakg2) March 9, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com