'నీ మనసు బంగారం తల్లీ'.. : చిరంజీవి

నీ మనసు బంగారం తల్లీ.. : చిరంజీవి
నడిచి వచ్చిన దారుల్ని, సాయం చేసిన మనుషుల్ని మర్చిపోకూడదంటారు. ఈ గెలుపు తన ఒక్కదానిదే కాదు..

నడిచి వచ్చిన దారుల్ని, సాయం చేసిన మనుషుల్ని మర్చిపోకూడదంటారు. ఈ గెలుపు తన ఒక్కదానిదే కాదు.. తనకు సాయం చేసిన అందరిదీ అంటూ.. అందరికీ భోజనం పెట్టి బట్టలు ఇచ్చింది. వారి పట్ల ఆమె తన కృతజ్ఞతను చాటుకుంది. వెయిట్ లిప్టింగ్ పోటీల్లో వెండి పతకం సాధించిన మీరా బాయి చాను ఒలింపిక్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేసింది.

అదే సమయంలో అంతకంటే గొప్పగా తాను చేసిన పనికి దేశం యావత్తు ఆమె పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నీ మనసు బంగారం తల్లీ అని చానుని మెచ్చుకున్నారు. మెడల్ గెలిచి ఇంటికి వచ్చిన రోజు నుంచి తనకు సాయం చేసిన వారందరి కోసం వెతుకుతోంది.

ఇంటి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంఫాల్ స్పోర్ట్స్ అకాడమీకి ప్రతి రోజు ట్రక్‌లో లిప్ట్ ఇచ్చి సహకరించిన ట్రక్ డ్రైవర్లు, క్లీనర్లు, హెల్పర్లు, తనకు సహకరించిన అందరినీ గుర్తుంచుకుని ఇంటికి పిలిచి భోజనం, బట్టలు పెట్టి కాళ్లకు నమస్కరించింది. ఇది కదా గెలుపు అంటే చిరంజీవి తన ట్వీట్టర్ పేజీలో రాసుకొచ్చారు.

ఇది కదా గెలుపు మలుపులో సాయం చేసిన ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞత అంటే. నీ మనసు బంగారం తల్లీ అని ట్విట్టర్‌లో చిరంజీవి పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story