Prasad Behra : యూ ట్యూబ్ స్టార్ ప్రసాద్ బెహ్రా అరెస్ట్

యూ ట్యూబ్ సిరీస్ లతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహ్రా. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ అతని టాలెంట్ ను గుర్తిస్తోంది. రీసెంట్ గా వచ్చిన కమిటీ కుర్రాళ్లు మూవీలో మంచి పాత్ర చేశాడు. రాబోతోన్న బచ్చలమల్లిలో కూడా ఓ కీలకమైన పాత్ర చేశాడు. రచయితగానూ ఆఫర్స్ వస్తున్నాయని చెబుతున్నాడు. అల్లరి నరేష్ ఏకంగా త్రివిక్రమ్ తో పోల్చాడు. అలాంటి వాడు ఓ అమ్మాయిని వేధించిన కేస్ లో అరెస్ట్ అయ్యి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించబడ్డాడు.
ప్రసాద్ బెహ్రా వీడియోస్ చూసిన వాళ్లంతా సరదాగా నవ్వుకుంటారు. అప్పుడప్పుడూ జీవిత సత్యాలు లాంటివి చెబుతుంటాడు. కానీ షూటింగ్ లొకేషన్ లో తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. వల్గర్ లాంగ్వేజ్ లో అందరి ముందూ తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడాడని, బాడీ షేమింగ్ చేశాడు అని అతనితోపాటు పెళ్లివారమండీ, మెకానిక్ సిరీస్ లలో నటించిన కంచన్ బామ్నే అనే నటి ఫిర్యాదు చేసింది.
ప్రసాద్ బెహ్రా తనకు యేడాదిన్నరగా తెలుసు అని.. గతంలో పెళ్లివారమండీ సిరీస్ చేస్తోన్న టైమ్ లోనే తనతో అమర్యాదగా ప్రవర్తించాడనీ.. దీంతో తను సిరీస్ నుంచి తప్పుకున్నానని.. అతను చాలాకాలం పాటు బతిమాలడంతో మళ్లీ మెకానిక్ సీరీస్ లో నటిస్తున్నానని చెప్పింది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రస్తుతం ‘ఇన్ఫినిటమ్ రోమ్ కామ్’ అనే యూ ట్యూబ్ ఛానల్ లో వస్తోంది. ఇప్పటి వరకూ 4 ఎపిసోడ్స్ వచ్చాయి. ఆ సిరీస్ చిత్రీకరణ సమయంలోనే ఈ నెల 11న తనతో అందరి ముందూ అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాడని, బాడీ షేమింగ్ చేశాడని ఈ నెల 14న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీస్ లు ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్ట్ కు తీసుకువెళ్లారు. కోర్ట్ అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అదీ మేటర్.. మనం చెప్పే నీతులు జీవితంలో కూడా పాటిస్తేనే వ్యక్తిత్వం ఉంటుంది. లేదంటే ఇలా అభాసు పాలు కావాలి. అదే టైమ్ లో అవతలి వాళ్లు కంప్లైంట్ ఇవ్వగానే అదే హండ్రెడ్ పర్సెంట్ నిజం అనుకోవడానికీ లేదు. నిజం ఏంటనేది కోర్ట్ తేలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com