Satyadev : టాక్ ను దాటిన కలెక్షన్స్ తో జీబ్రా

Satyadev :  టాక్ ను దాటిన కలెక్షన్స్ తో జీబ్రా
X

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా చేస్తోన్న ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించడం లేదు. తను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. నటన పరంగా ఎప్పుడూ వంక పెట్టాల్సిన పనిలేదు. ఏ కామెంట్స్ లేవు. అయినా సినిమా హిట్ అయితేనే కదా రేంజ్ మారుతుంది. ఈ విషయంలో హీరోగా తన స్థాయిని పెంచుకొనే స్థాయిలో అతని కథల ఎంపిక కనిపించడం లేదు. అయితే తాజాగా వచ్చిన జీబ్రాపై మాత్రం చాలా అంచనాలు పెట్టుకున్నాడు సత్యదేవ్. ఇది తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చినట్టే అనే భావనలో కనిపించాడు. ప్రమోషన్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

బ్యాంకింగ్ సెక్టర్ లో జరిగే మోసాలకు సంబంధించిన కథతో వచ్చిన జీబ్రాను రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ తో పోల్చారు ప్రేక్షకులు. దానితో పోలిస్తే.. ఇది తేలిపోయింది అనే కమెంట్స్ చేశారు. రివ్యూస్ సైతం అలాగే అన్నాయి. సత్యదేవ్ ఇక క్యారెక్టర్స్ చేసుకోవడం బెటర్ అన్నారు కూడా. బట్ సత్య దేవ్ అండ్ టీమ్ మాత్రం సక్సెస్ మీట్స్ కూడా పెట్టేసుకున్నారు. తాజాగా ఈ మూవీ కలెక్షన్స్ పోస్టర్స్ ను వదులుతున్నారు. ఈ నెల 22న విడుదలైన ఈ చిత్రానికి ఇప్పటి వరకు 9.43 కోట్లు కలెక్షన్స్ వచ్చాయని చెబుతూ కొత్త పోస్టర్ వేశారు. చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. వారం రోజుల్లో ఈ కలెక్షన్స్ సాధించడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే టాక్ వేరుగా ఉంది. అయినా ఈ కలెక్షన్స్ తో పోస్టర్ వేయడం కొందరికి అనుమానాలు కలిగిస్తుంటే.. ఇంకొందరు మాత్రం సినిమా నిజంగానే బావుంది. అనవసరంగా లక్కీ భాస్కర్ తో పోల్చి చూస్తున్నారు అంటున్నారు. మొత్తంగా సత్యదేవ్ మాత్రం తమ సినిమా బ్లాక్ బస్టర్ అనే నమ్మకంతోనే ఉన్నాడు.

ఈశ్వర్ కార్తీక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సత్యదేవ్ తో పాటు ప్రియా భవానీ శంకర్, డాలీ ధనంజయ, సత్యరాజ్, సత్య కీలక పాత్రల్లో నటించారు.

Tags

Next Story