ట్రోల్స్ పై స్పందించిన జీనత్ అమన్.. 'ఇన్ స్టంట్ బ్లాక్ ఫర్ రెసిపీ' అంటూ పోస్ట్

బాలీవుడ్ నటి జీనత్ అమన్ సోషల్ మీడియాలో అడుగుపెట్టినప్పట్నుంచి పలు ఆసక్తికరమైన పోస్టులతో అలరిస్తోంది. వృద్ధాప్యంలోనూ చురుగ్గా ఉంటూ.. తన అభిప్రాయాలను, భావాలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా 'ఇన్ స్టంట్ బ్లాక్ ఫర్ రెసిపీ' అంటూ ఓ కొత్త పోస్ట్‌లో ముందుకొచ్చింది. దాంతో పాటు ట్రోల్స్ చేసే వారికి కూడా ఆమె హెచ్చరిక జారీ చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఉల్లాసకరమైన, ఆనందకరమైన ఫొటోలను షేర్ చేస్తూ వస్తోన్న జీనత్.. ఈ వర్షాకాలంలో తన గార్డెన్ లో ప్రకృతి అందాలను ఆస్పాదించే కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ఈ చిత్రాల్లో స్కర్ట్‌పై పూల రెయిన్‌కోట్‌ను ధరించి ఉన్న ఆమె.. ప్రశాంతమైన మోముతో కనిపిస్తోంది. తన మనోహరమైన ఫొటోల స్ట్రింగ్‌తో పాటు, సుదీర్ఘమైన, ఆలోచింపజేసే శీర్షికను కూడా రాసుకొచ్చింది. 'ఆరోగ్యకరమైన సంబంధం'లో 'హద్దుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఆమె సోషల్ మీడియాలో మాటల 'దూషణ', 'గాసిప్' గురించి కూడా ఆమె ప్రస్తావించింది.
స్త్రీకి వ్యతిరేకంగా స్త్రీని ఎదిరించే అంశాన్ని హైలైట్ చేసిన జీనత్ అమన్.. “నా పేజీలో మీకు అసహ్యకరమైన, తీవ్రమైన వాదనలు ఉండవు. మీరు అలా చేస్తే పూర్తిగా మూర్ఖులుగా కనిపిస్తారు. నా మాటలను వక్రీకరించకుండా మీరు నిజంగా నన్ను కోట్ చేయాలి. నా క్యాప్షన్‌లను కూడా సరిగ్గా కాపీ పేస్ట్ చేయని ఆన్‌లైన్ పోర్టల్స్, నేను మిమ్మల్ని చూస్తున్నాను అని రాశారు. ఆన్‌లైన్ ట్రోల్‌లకు హెచ్చరికగా “భిన్నమైన అభిప్రాయాలు, వ్యక్తిగత కథనాలు, గౌరవప్రదమైన వ్యాఖ్యలు, ప్రశ్నలకు స్వాగతం. అయితే నాకు ట్రోల్‌ల కోసం టైం పెట్టే ఓపిక లేదు. ఇక "బ్లాక్" బటన్ విషయానికి వస్తే చాలా హ్యాపీగా ఉన్నాను" అని అన్నారు.
ఇంటర్నెట్‌ను 'విషపు ప్రదేశం'గా అభివర్ణించిన అమన్.. "చాలా మంది వ్యక్తులు సోషల్ మీడియాతో పోరాడుతున్నారని, ఇంటర్నెట్ లో అబ్సెసివ్, కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని నాకు తెలుసు. కానీ నేను ఆ దారిలో వెళ్లాలని గానీ, మిమ్మల్ని అక్కడికి పంపాలని గానీ అనుకోను. కాబట్టి నా ఆజ్ఞలను పాటించండి. మీరు అలా చేస్తే అందరం సంతోషంగా ఉంటాము అంటూ ఆమె ఇన్ స్టాలో రాసుకువచ్చింది.
ఇక జీనత్ పోస్టుపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆమెను పొగుడ్తూ కామెంట్లు చేస్తున్నారు. మీరు చెప్పే విధానం చాలా బాగుందని, మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇక జీనత్ సినిమా విషయాలకొస్తే.. అశుతోష్ గోవారికర్ 2019లో రూపొందించిన హిస్టారికల్ డ్రామా పానిపట్‌లో చివరిగా కనిపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com