ప్రమాదకరంగా ఉక్రెయిన్‌లోని 'కఖోవ్కా డ్యాం'

ప్రమాదకరంగా ఉక్రెయిన్‌లోని కఖోవ్కా డ్యాం

ఉక్రెయిన్‌లోని కఖోవ్కా డ్యాం ప్రమాదకరంగా మారింది. డ్యాంనుంచి పెద్ద ఎత్తున నీరు లోతట్టు ప్రాంతాలకు చేరింది. దీంతో 5 మీటర్లకుపైగా ఎత్తుకు చేరింది. మరోవైపు ఇరు వర్గాల సేనలు పాతిన మందుపాతరలు నీటిలో కొట్టుకుపోయి.. జనావాసాల్లోకి చేరుతున్నాయి. ఉక్రెయిన్‌, రష్యా దళాలు అమర్చిన యాంటీ ట్యాంక్‌ మైన్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఇవి ఎక్కడి వెళ్లాయో ఎవరికీ తెలియని పరిస్థితి. దీంతో సహాయక బృందాలకు ప్రాణాంతకంగా మారింది. మందుపాతరలను గుర్తించి తొలగించడం చాలా కష్టమవుతోంది. ముఖ్యంగా టీఎం-57 మైన్లను అమర్చారు. వరద దెబ్బకు ఇక్కడ పాతిన ఆ మందుపాతరలు దిగువ ప్రదేశాలకు కొట్టుకుపోయాయి. ఎక్కడ ఎప్పుడు పేలుతాయోనని ఆందోళన చెందతున్నారు ప్రజలు. ఆ మైన్లు అక్కడి ప్రజలకే కాదు.. సహాయక బృందాలకు కూడా ముప్పుగా మారాయి.

దక్షిణ ఖేర్సాన్‌లో దాదాపు 600 కిలోమీటర్ల మేర భూభాగం నీటమునిగింది. ఈ విషయాన్ని స్థానిక ఉక్రెయిన్‌ మిలటరీ కమాండర్‌ ధ్రువీకరించారు. చాలా చోట్ల నీటి మట్టం 5.61 మీటర్లకు చేరిందని పేర్కొన్నారు. ముఖ్యంగా నీపర్‌ నది తూర్పు భాగం లోతట్టులో ఉండటంతో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. మొత్తం వరదలో దాదాపు 60శాతానికి పైగా తూర్పు తీరంలోనే ఉంది. మరో 30శాతం పశ్చిమ భాగాన ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అనేక నీటిలో చిక్కుకుపోయిన వారి వద్ద మంచినీరు కూడా లేకపోవడంతో డ్రోన్ల సాయంతో వాటర్‌ బాటిళ్లను జారవిడుస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story