అన్ని ఫార్మాట్లకు మురళి విజయ్ గుడ్‌బై

భారత జట్టు సీనియర్ బ్యాట్స్‌మెన్ మురళి విజయ్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అన్నిఫార్మట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్‌లో, రిటైర్‌మెంట్ లేఖను పోస్ట్ చేశాడు. 2008లో భారత జట్టులోకి ప్రవేశించిన విజయ్ ఓపెనర్‌గా కీలక ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టెస్టు మ్యాచుల్లో ఓపెనర్‌గా ఉన్న విజయ్ 2018లో తన చివరి మ్యాచ్ ఆడాడు. 2008 నుంచి 2018 వరకు టెస్టుల్లో దాదాపు 4వేల పరుగులు సాధించాడు. అందులో 12 సెంచరీలు, 15 అర్ధసెంచరీలు ఉన్నాయి. 38 ఏళ్ల విజయ్ రిటైర్ మెంట్ తర్వాత ప్రపంచ క్రికెట్ పై దృష్టిపెట్టనున్నట్లు తెలిపాడు. తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ విజయ్ కృతజ్ఞతలు తెలిపాడు.
మొత్తం 61 టెస్టులు, 17 వన్డే మ్యాచులు ఆడిన మురళి టెస్టుల్లో 3982 పరుగులు, వన్డేల్లో 339 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియాపై బ్రిస్బేన్ వేదికగా చేసిన 144 పరుగులు, ఇంగ్లండ్ పై ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా చేసిన 145 పరుగులు విజయ్ టెస్ట్ కెరీర్ లో బెస్ట్ గా నిలిచాయి. దీంతో విదేశాల్లో అతడికి మంచి రికార్డు ఉంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్, మయాంక్ అగర్వాల్ లాంటి యువ ఆటగాళ్లు ఓపెనర్లుగా నిలదొక్కుకోవటంతో బీసీసీఐ 2018 నుంచి మురళీ విజయ్ ను జట్టులోకి తీసుకోవడం లేదు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com