యువ క్రికెటర్‌పై దాడి

యువ క్రికెటర్‌పై దాడి
సెల్ఫీ ఇవ్వడం లేదని పృథ్వీషాపై దాడికి పాల్పడ్డ అమ్మాయిలు

భారత యువ క్రికెటర్‌ పృథ్వీషాపై దాడి జరిగింది. సెల్ఫీ ఇవ్వడంలేదని అతను ప్రయాణిస్తున్న కారుపై అమ్మాయిలు దాడికి పాల్పడ్డారు. షా తన స్నేహితుడి కారులో కూర్చున్న సమయంలో దాదాపుగా ఓ 8మంది యువతులు దాడి చేశారని తెలుస్తోంది. అయితే.. క్రికెటర్ పృథ్వీ షా, తన మిత్రుడు ఆశిష్ యాదవ్‌‌తో కలిసి ఓ స్టార్‌ హోటల్లో విందుకు వెళ్లాడు. అక్కడ ఉన్న సనా గిల్, షోబిత్ ఠాకూర్, వారి అనుచరులు పృథ్వీ షాతో సెల్ఫీలు దిగాలని పట్టుబట్టారు. దీంతో సెల్ఫీ దిగిన షా వెళుతుంటే పదే పదే దిగాలని ఇబ్బంది పెట్టారు. గమనించిన హోటల్‌ సిబ్బంది వారిని హోటల్‌ నుంచి బయటకు పంపారు. అక్కడితో ఆగని అమ్మాయిలుపృథ్వీ షా, ఆశిష్‌ యాదవ్‌లతో గొడవకు దిగారు. వారి కారును వెంబడించి బేస్‌బాల్‌ స్టిక్‌తో కారు అద్దాలను పగలగొట్టారు. అనంతరం ఆశిష్‌ ముంబై పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పృథ్వీ షా, ఆశిష్‌లపై దాడికి పాల్పడ్డ 8 మంది అమ్మాయిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారిని కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story