HBD Sourav Ganguly : కుడిచేతి వాటం అయిన గంగూలీ.. ఎడమచేత్తో బ్యాటింగ్ ఎందుకు?

HBD Sourav Ganguly : సౌరవ్ గంగూలీ.. ఆటగాడిగా మెప్పించాడు, సారధిగా అదరగొట్టాడు, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇలా ఎదో విధంగా క్రికెట్ అభిమానులకి అయితే దగ్గరనే ఉంటున్నాడు దాదా... ఈ రోజు నలబై తొమ్మిదవ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు ఈ కోల్‌కతా రాకుమారుడు. ఈ సందర్భంగా గంగూలీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...!
1. 8జులై,1972 న కోల్‌కతాలోని అత్యంత ధనవంతుల్లో కుటుంబంలో జన్మించాడు గంగూలీ..
2. గంగూలీ క్రికెట్ ఆడటం అతని తల్లిదండ్రులకు ఇష్టం లేదు. కానీ ఆయన అన్నయ్య స్నేహశీష్ గంగూలీ ఇచ్చిన ప్రోత్సాహంతో క్రికెట్ నేర్చుకున్నాడు గంగూలీ.
3. వాస్తవానికి గంగూలీ కుడిచేతి వాటం. రాయడం, బౌలింగ్ చేయడం అంతా కుడిచేత్తోనే. ఆయన అన్నయ్య స్నేహాశీష్ ఎడమ చేతి వాటం ఆటగాడు. అతడి కిట్‌ను ఉపయోగిస్తూ అదే శైలి అలవాటు చేసుకున్నాడు.
4. వరుసుగా నాలుగు మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు గెలుచుకున్న ఏకైక ఆటగాడు గంగూలీ కావడం విశేషం.. అది కూడా పాకిస్తాన్ పైన కావడం మరో విశేషం.
5. వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన తొమ్మిదవ ఆటగాడు గంగూలీ. ఇండియా నుంచి మూడో ఆటగాడు. (సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నారు)
6. గంగూలీ సెంచరీ కొట్టిన ఏ టెస్ట్ మ్యాచ్ కూడా ఇండియా ఓడిపోలేదు. 12 మ్యాచులు డ్రా కాగా నాలుగింటిలో విజుయం సాధించింది.
7. వన్డే క్రికెట్‌లో 10,000 పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్‌లు సాధించిన ఆరుగురు క్రికెటర్లలో గంగూలీ ఒకరు.
8. ప్రపంచంలో 100 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు, 300 లేదా అంతకంటే ఎక్కువ వన్డేలు ఆడిన 14 మంది క్రికెటర్లలో గంగూలీ ఒకరు.
9. విదేశాల్లో అత్యంత విజయవంతమైన భారత టెస్టు కెప్టెన్ గంగూలీనే. మొత్తం 28 మ్యాచులకు కెప్తెన్సీ వహించగా 11 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.
10. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రంలో సెంచరీ(ఇంగ్లాండ్‌పై) చేసి ఆఖరి టెస్టు ఇన్నింగ్స్‌లో తొలి బంతికే ఔటైన((ఆస్ట్రేలియాపై)) ఒకే ఒక్క బ్యాటర్ గంగూలీ.
11. బీసీసీఐ అధ్యక్షుడైన రెండో క్రికెటర్ సౌరవ్ కావడం విశేషం. దాదా కంటే ముందు 1954లో విజయనగరం మహారాజు(పూసపాటి విజయ ఆనంద గజపతి రాజు)ఆ పదవిని అలంకరించారు. సునిల్ గావస్కర్, శివలాల్ యాదవ్ తాత్కాలిక అధ్యక్షులుగా పనిచేశారు.
12. గంగూలీ డోనాను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకి సనా గంగూలీ కూతురు ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com