Rohith Sharma : రోహిత్ శర్మ పాదాలపై పడిపోయిన అభిమాని..!

Rohith Sharma : నిన్న రాంచి వేదికగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి ప్రవేశించి తన అభిమాన క్రికెటర్ అయిన రోహిత్ శర్మ పాదాలపైన అమాంతం పడిపోయాడు.
వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతడిని గ్రౌండ్ నుంచి బయటకు తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది రోహిత్ కి గతంలో చాలా సార్లు ఎదురైంది. ఇక మ్యాచ్ విషయానికి వచ్చేసరికి ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
అనంతరం 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు రాహుల్(65), రోహిత్ (55) అదరగొట్టారు. దీనితో మరో మ్యాచ్ ఉండగానే ఇండియా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
And a fan stormed into the field!!! The fellow sitting beside me, "ab maar khaaye chahe jo ho uska Sapna poora ho gaya! Ab yeh Ranchi mein Hatia mein Jharkhand mein poore India mein famous ho gaya!!" #IndiaVsNewZealand #INDVsNZT20 #fans #CricketTwitter pic.twitter.com/6NsIQDY0fO
— Sunchika Pandey/संचिका पाण्डेय (@PoliceWaliPblic) November 19, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com