MS Dhoni: మిస్టర్ కూల్ ఒక్కసారిగా వైలెంట్‌గా మారిపోయాడే..!

MS Dhoni: క్రికెటర్లకు కేవలం క్రికెట్ వరల్డ్‌లోనే కాదు.. ఇతర విభాగాల ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణే లభిస్తుంది. క్రికెట్ అంటే ఏంటో తెలియని వారికి కూడా క్రికెటర్లంటే అభిమానం ఉంటుంది. అలా తన కూల్ యాటిట్యూడ్‌తో దేశవ్యాప్తంగా ఆదరణ సంపాదించుకున్నాడు ఎమ్ ఎస్ ధోనీ. ఇప్పుడు ఆ ఎమ్ ఎస్ ధోనీని అందరూ త్వరలోనే ఓ కొత్త అవతారంలో చూడబోతున్నారు.
త్వరలోనే ధోనీ లీడ్‌గా ఓ గ్రాఫికల్ నవల అందరి ముందుకు రానుంది. దాని పేరు 'అధర్వ.. ది ఆరిజిన్'. ఈ గ్రాఫికల్ నవలకు సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదలయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంగీత దర్శకుడు రమేష్ తమిళ్‌మణి ఈ గ్రాఫికల్ నవలను రచిస్తున్నాడు. అచ్చం సినిమాను తలపిస్తున్న ఈ గ్రాఫికల్ నవల గురించి అప్పుడే సోషల్ మీడియాలో చర్చ మొదలయిపోయింది.
అధర్వ మోషన్ పోస్టర్‌లో ధోనీ కత్తి పట్టుకొని యుద్ధరంగంలో వీరుడిగా కనిపిస్తున్నాడు. ఇది చూస్తుంటే ఈ నవల పెద్దలను మాత్రమే కాదు.. చిన్నపిల్లలను కూడా విపరీతంగా అలరించేటట్టుగా అనిపిస్తోంది. ధోనీ ఎంటర్‌టైన్మెంట్ కూడా ఈ నవల నిర్మాణంలో పాలుపంచుకుంటోంది. 2019లో ధోనీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థనుధోనీతో పాటు తన భార్య సాక్షి కలిసి స్థాపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com