Harbhajan Singh : రాజ్యసభకి హర్భజన్..ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్..!

Harbhajan Singh : పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పంజాబ్‌కి చెందిన, ఇండియన్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ని రాజ్యసభకి పంపించాలని ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. పంజాబ్ నుంచి ఎన్నికైన ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది.
ఈ స్థానాలకు ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇటీవల క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ రిటైర్మెంట్ ప్రకటించిన భజ్జీ.. త్వరలోనే ఆప్‌లో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే జలంధర్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హామీ ఇచ్చారు.
ఆ భాద్యతలను కూడా హర్భజన్‌కి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హర్భజన్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com