Arjun Tendulkar..అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్.. వరుసగా సిక్సర్లతో బాదుడే..బాదుడు!

క్రికెట్ దేవుడు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ జింఖానా జట్టుపై అదరగొట్టాడు. దీంతో తండ్రికి తగ్గ తనయుడంటూ అర్జున్‌పై టెండూల్కర్ ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఎంఐజీ క్రికెట్ క్లబ్ తరఫున అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) బరిలోకి దిగారు. జింఖానా టీమ్‌పైన కేవలం 31 బంతుల్లోనే 77 పరుగులు సాధించాడు. ఇక ఆఫ్ స్పిన్నర్ హషీర్ దఫేదార్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదేశాడు. మొత్తంగా అతని ఇన్నింగ్స్‌లో 8 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లోనూ తన సత్తా చాటుకున్నాడు. కేవలం 41 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లని అర్జున్ టెండూల్కర్ పడగొట్టాడు.
అర్జున్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చూసిన టెండూల్కర్ అభిమానులు.. సోషల్ మీడియాలో అర్జున్ టెండూల్కర్‌ని ఇక మామూలుగా లేపట్లదు. ఇక వరుసగా సిక్సర్లతో బాదుడే..బాదుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
కాగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎంఐజీ క్రికెట్ క్లబ్ 45 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోరు చేసింది. 386 లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన జింఖానా జట్టు 41.5 ఓవర్లలోనే 191 పరుగులకి కుప్పకూలిపోయింది.
ఇదిలా ఉంటే అర్జున్ టెండూల్కర్ ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా జరగనున్న ఐపీఎల్ 2021 సీజన్ ఆటగాళ్ల వేలానికి తన పేరుని రిజస్టర్ చేసుకున్నాడు. రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి అడుగుపెట్టాడు. అయితే ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో అర్జున్ టెండూల్కర్‌ని తీసుకునేందుకు ఇప్పటి వరకూ ముంబయి ఇండియన్స్ మాత్రమే ఆసక్తి కనబరుస్తూ వచ్చింది. కానీ.. తాజాగా అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండర్ షో చూసిన తర్వాత.. వేలంలో అతని కోసం టోర్నీలోని 8 ఫ్రాంఛైజీలు పోటీపడే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. లెఫ్ట్ హ్యాండ్ వాటం ఫాస్ట్ బౌలర్ కావడంతో అర్జున్ టెండూల్కర్ డిమాండ్ మరింత పెరగవచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com