Asia Cup 2022: యూఏఈలో ఆసియా కప్.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీమిండియా..

Asia Cup 2022: యూఏఈలో ఆసియా కప్.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీమిండియా..
X
Asia Cup 2022: యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్ షెడ్యూల్‌ విడుదలైంది.

Asia Cup 2022: యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్ షెడ్యూల్‌ విడుదలైంది.ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరగనుంది. ముందుగా శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ, అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఈ టోర్నీని యూఏఈకి మార్చిన సంగతి తెలిసిందే.

ఆసియా కప్‌లో భాగంగా ఆగస్టు 27న శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత ఆగస్టు 28 ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య పోరు జరగనుంది. బంగ్లాదేశ్ జట్టు కూడా ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటుంది. అలాగే క్వాలిఫయర్ జట్టు కూడా ఆసియా కప్‌లో ఆడనుంది. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో భారత్-పాకిస్థాన్, క్వాలిఫయర్ జట్లు ఉన్నాయి. గ్రూప్‌ బీలో శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.

ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 2018లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి, భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆసియా కప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. భారత జట్టు 7 సార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది. అయితే పాకిస్థాన్‌ కేవలం రెండు సార్లు మాత్రమే ఆసియా కప్‌ను గెలుచుకుంది. పాకిస్థాన్ చివరిసారిగా 2012లో ఆసియా కప్ గెలిచింది. ఈ టోర్నీని శ్రీలంక నాలుగుసార్లు గెలుచుకోవడం విశేషం.

ఐసీసీ టోర్నీల మాదిరిగానే ఆసియా కప్‌లో కూడా పాకిస్థాన్‌పై భారత జట్టు సత్తా చాటుతోంది. ఆసియా కప్‌లో భారత్‌ వన్డే, టీ20 ఫార్మాట్లలో పాక్‌ను ఓడించింది. టీ20 ఫార్మాట్ గురించి మాట్లాడితే, పాకిస్థాన్‌తో ఆడిన ఒక మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. వన్డే ఫార్మాట్‌లో భారత్ 13 మ్యాచుల్లో 7 గెలిచింది. యూఏఈ గడ్డపై జరిగిన ఆసియా కప్‌లో భారత్ 4 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ను ఓడించింది.

Tags

Next Story