క్రికెట్

Asia Cup 2022: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! ఆసియా కప్ 2022 షెడ్యూల్ విడుదల..

Asia Cup 2022: పాకిస్థాన్, ఇండియా మ్యాచ్‌ అంటే.. యుద్ధ వాతావరణమే.

Asia Cup 2022: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..! ఆసియా కప్ 2022 షెడ్యూల్ విడుదల..
X

Asia Cup 2022: పాకిస్థాన్, ఇండియా మ్యాచ్‌ అంటే.. యుద్ధ వాతావరణమే. ఈ రెండు జట్లు కలిసి గ్రౌండ్‌లోకి అడుగుపెడితే.. క్రికెట్ అభిమానులకు పండుగే పండుగ. ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా వాటిని పక్కనపెట్టేసి టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంతా క్రేజ్ మరీ. ప్రస్తుతం ఆసియా కప్ రూపంలో ఆ అవకాశం మళ్లీ రాబోతోంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ టోర్నమెంట్ జరగనుంది.

ఇందులో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ ఇప్పటికే అర్హత సాధించాయి. హాంకాంగ్, కువైట్, యూఏఈ, సింగపూర్ జట్లు క్వాలిఫయర్ కోసం పోటీ పడుతున్నాయి. ఈనెల 27న శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్ తో టోర్నీ ప్రారంభం అవుతుంది. 28న పాకిస్తాన్ తో ఇండియా తలపడనుంది. దీంతో ప్రేక్షకులకు పండుగ వాతావరణం కలగనుంది. ఈ మేరకు ఇప్పటి నుంచే అభిమానులు తహతహలాడుతున్నారు. ఆగస్ట్ 28 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

శ్రీలంక ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో తాము టోర్నీ నిర్వహించలేమని చెప్పడంతో వేదిక యూఏఈకి బదిలీ అయింది. దీంతో టీ20 ఫార్మాట్ లో టోర్నీ జరగనుంది. దీనికి గాను ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ ఆధారంగా వారిని తీసుకోవాలని భావిస్తోంది. మెరుగ్గా రాణించే వారికే అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఈ మేరకు తుది జట్టు ఎంపిక కోసం కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఇంగ్లండ్, వెస్టిండీస్ టూర్లలో విజయాల పరంపర కొనసాగిస్తున్న టీంఇండియా ఆసియా కప్ లోనూ ఆదరగొడుతుందని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కలలు కంటున్నారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES