Matthew Wade: క్యాన్సర్‌ని జయించి.. కార్పెంటర్‌గా జీవితాన్ని ప్రారంభించి..

Matthew Wade: విజయం వరించినప్పుడే వారి గురించిన నిజాలు వెలుగులోకి వస్తాయి. కానీ ఆ విజయం వెనుక వారు పడ్డ కష్టం.. అధిగమించిన ఆటుపోట్లు, అన్నీ అవలోకనం చేసుకుంటే ప్రతి ఒక్కరి విజయం వెనుక ఎంత స్ట్రగుల్ ఉంటుందో తెలుస్తుంది. చిన్న చిన్న సమస్యలకే కృంగిపోయే వారికి వీరి విజయగాధలు స్పూర్తిదాయకం. ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ వేడ్ గురించి ఈ సమయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దుబాయ్‌లో జరిగిన ఐసిసి టి 20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో పాకిస్తాన్‌కు చెందిన షాహీన్ షా అఫ్రీదీని వరుసగా మూడు సిక్సర్‌లు బాది మ్యాన్ ఆఫ్ మూమెంట్ అయ్యాడు మాథ్యూ వేడ్. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రను మార్చిన అత్యంత ప్రభావవంతమైన ఓవర్ ఇది. మరోసారి అతడి గురించి మాట్లాడుకునేలా చేసింది.
మాథ్యూ వేడ్ 16 సంవత్సరాల వయసులో క్యాన్సర్‌ని జయించాడు..
ఆర్థిక ఇబ్బందులకు తోడు అతడి ఆరోగ్యం కూడా అందుకు సహకరించలేదు. చాలా చిన్న వయస్సులోనే అతడు క్యాన్సర్ బారిన పడ్డాడు. 16 సంవత్సరాల వయస్సులో అనారోగ్యానికి గురయ్యాడు. సాధారణ చెకప్‌లో టెస్టిక్యులర్ క్యాన్సర్ అని తేల్చారు వైద్యులు. చికిత్సలో భాగంగా ఇచ్చే కీమోథెరపీలో తల వెంట్రుకలు కోల్పోతాడని చెప్పారు.
16 ఏళ్ల యువకుడికి ఆ విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా అనిపించింది. అయినా కుటుంబసభ్యులు ఇచ్చిన ధైర్యంతో క్యాన్సర్‌ని జయించాడు. తండ్రితో పాటు కార్పెంటర్ పనిని చేసేవాడు కుటుంబ పోషణ నిమిత్తం. ఆ తరువాత క్రికెట్ పట్ల ఇష్టాన్ని పెంచుకుని బ్యాట్ పట్టాడు.
"నేను గేమ్‌లోకి రావడానికి కొంచెం భయపడ్డాను మరియు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడానికి ఇది చివరి అవకాశం అని తెలుసు," అని మాథ్యూ మ్యాచ్ తర్వాత విలేకరులతో చెప్పాడు. "ఇది (ఫైనల్) నా చివరి గేమ్ కూడా కావచ్చు. వారికి నా అవసరం ఉన్నంత కాలం నేను ఆడతాను. అయితే నేను జట్టులో ఉన్నప్పుడు కొన్ని గేమ్‌లైనా గెలవాలని ఆశిస్తాను. "నన్ను నేను తిరిగి ఆవిష్కరించుకునే అవకాశం లభించినందుకు నేను సంతోషంగా ఉన్నాను.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com