Ashes Test: కష్టాల్లో ఇంగ్లాండ్, ఆధిక్యంలో ఆస్ట్రేలియా

లండన్ లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్ 2వ టెస్ట్ ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్ జట్టుపై ఆస్ట్రేలియా 200 పైగా ఆధిక్యం సాధించింది. 3వ రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకి 130 పరుగులు చేసి 221 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ జట్టు వెనువెంటనే వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడ్డారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉస్మాన్ ఖవాజా 45 పరుగులు, 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండవ ఇన్నింగ్స్‌లో వార్నర్, ఖవాజా ఆస్ట్రేలియాకు అర్ధసెంచరీ భాగస్వామ్యం అందించారు. వార్నర్ వెనుదిరిగిన తర్వాత వచ్చిన లబుషేన్‌తో కలిసి ఖవాజా స్కోర్‌బోర్డ్ పెంచేప్రయత్నం చేశారు. లబుషేన్(30, 51 బంతులు, 4 x 5) ను ఆండర్సన్ ఔట్ చేశాడు. అనంతరం 3వ సెషన్‌లో ఖవాజా, స్మిత్‌లు వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ మళ్లీ తిరిగి ప్రారంభమవ్వలేదు.
అంతకు ముందు 3వ రోజును 278/4 తో ప్రారంభించిన ఇంగ్లాండ్‌ను స్టార్క్ దెబ్బ కొట్టాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్(17 పరుగులు)ను రెండవ బంతికే వెనక్కి పంపాడు. బ్యాటింగ్ వచ్చిన వికెట్ కీపర్ బెయిర్ స్టో ఫోర్ కొట్టి ఖాతా తెరిచాడు. అర్ధసెంచరీ సాధించిన అనంతరం హ్యారీ బ్రూక్(50 పరుగులు)ని స్టార్క్ వెనక్కి పంపాడు. స్కోర్‌బోర్డ్ పెంచేలా ధాటిగా ఆడే ప్రయత్నంలో ఇంగ్లాండ్ బెయిర్‌స్టో వికెట్‌ను కూడా కోల్పోయి కష్టాల్లో పడింది. బెయిర్‌స్టో హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ స్కోర్ 7 వికెట్లకు 311 పరుగులకు చేరింది. తర్వాత వచ్చిన టెయిలెండర్లు రాబిన్స్‌సన్, స్టువర్ట్ బ్రాడ్‌లు స్కోర్‌బోర్డ్ పెంచే ప్రయత్నం చేసినప్పటికీ వెనువెంటనే వికెట్లు పడటంతో ఇంగ్లాండ్ 325 పరుగులకే ఆలౌటయింది. ఆస్ట్రేలియాకు 91 పరుగుల ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా బౌలర్లు స్టార్ ఆఫ్-స్పిన్నర్ నాథన్ లియాన్ లేని లోటును లేకుండా వికెట్లు తీశారు. నాథన్ లియోన్ గాయంతో మైదానాన్ని వీడాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 3/88, స్పిన్నర్ ట్రావిస్ హెడ్ 2/17, ఫాస్ట్ బౌలర్లు హేజిల్‌వుడ్ 2/71 తో రాణించారు. కమిన్స్, నాథన్ లియాన్, కామెరూన్ గ్రీన్‌లు చెరో వికెట్ తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com