Australia vs England : తొలిటెస్టులో ఆసీస్ ఘనవిజయం..!

Australia vs England : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది .. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.. ఇంగ్లండ్ విధించిన 20 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి చేధించింది. దీనితో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి ఉంది. ఆసీస్ బ్యాట్స్ మెన్ లలో అలెక్స్ కెరీ 9 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 147 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో 297రన్స్ కు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో ట్రెవిస్ హెడ్(152 పరుగులు) శతకంతో మెరవడం.. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 94 పరుగులు, లబుషేన్ 74 పరుగులతో రాణించడంతో 425 పరుగుల భారీ స్కోరు చేసింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com