Australia vs India: స్టేడియంలో సందడి చేసిన మోదీ, ఆంటోనీ

అసీస్ తో టీమిండియా చివరి టెస్ట్ మ్యాచ్ ప్రత్యేకత సంతరించుకుంది. అహ్మదాబాద్ లోని అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్ పై అంచనాలు తారస్థాయికి చేరాయి. భారత్ - ఆసీస్ దేశాల మధ్య 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ ప్రత్యేకత సంతరించుకుంది. మైత్రీ సంబరాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ లు స్టేడియంలో సందడి చేశారు. నాలుగోటెస్టు తొలిరోజు ఆట చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో కలిసి మ్యాచ్ తిలకించేందుకు స్టేడియం చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌కు స్వాగతం పలికిన ప్రధాని నరేంద్రమోదీ.. స్టేడియంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయనతో కలిసి వీక్షించారు.
అనంతరం ఇరువురు ప్రధానులు బంగారు పూత పూసిన గోల్ఫ్ కారులో స్టేడియం చుట్టూ కలియ తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఇరుదేశాల ప్రధానుల రాకతో స్టేడియం కోలాహాలంగా మారింది. నరేంద్ర మోదీ స్టేడియంలోని విశేషాలను భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీకి రవిశాస్త్రి వివరించారు. ఇరు జట్ల మధ్య జరిగిన విశేషాలను తెలియజేశారు. అంతకుముందు ఇరు దేశాల మధ్య 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా బీసీసీఐ తరఫున అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆస్ట్రేలియా ప్రధానికి ప్రత్యేక మెమొంటోను అందజేశారు.
వరుసగా రెండు టెస్టుల్లో గెలిచి సిరీస్ రేసులో ముందంజలో ఉన్న భారత్ కు మూడో మ్యాచ్ లో మాత్రం ఆస్ట్రేలియా షాకిచ్చింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లేందుకు నాలుగో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 3-1తో సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com